Friday, April 26, 2024

మన తెలంగాణ దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పెద్ది…..

- Advertisement -
- Advertisement -

Peddi sudharshan Reddy unveiled mana telangana calender

వరంగల్: మన తెలంగాణ దిన పత్రిక అనతి కాలంలోనే ప్రజల అభిమానాన్ని చురగొన్నదని టిఆర్ఎస్ ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశంసించారు. మన తెలంగాణ దిన పత్రిక – 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, నర్సంపేట సోసైటి చైర్మన్ మురాల మోహన్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ ఖానాపురం మండల కన్వీనర్ కుంచారపు వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ కెవి జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, ఉమ్మడి వరంగల్ జిల్లా మన తెలంగాణ బ్యూరో ఇంచార్జ్ కామగోని శ్రీనివాస్, నర్సంపేట ఆర్ సి ఇంచార్జీ కుండె సురేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News