Thursday, May 16, 2024

యుద్ద ప్రాతిపదికన పెండింగ్ పనులు పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

వరంగల్ : జిల్లాలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవనం, మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత ఆర్‌అండ్‌బి అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా స్థానికంగా నిర్మాణం అవుతున్న సమీకృత కలెక్టరేట్, మె డికల్ కాలేజీ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. సమీకృత కలెక్టరేట్ ఆశాంతం పరిశీలించిన కలెక్టర్ నిర్మాణ పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

సమీకృత కలెక్టరేట్ చివరి పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని, వర్షాలు తగ్గి 10 రోజులు గడిచినప్పటికి పనులలో వేగం పెరగలేదని కలెక్టర్ పేర్కొన్నారు. 15 ఎకరాలలో 59 కోట్ల 45లక్షల వ్యయంతో ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ భవన ని ర్మాణం చేపట్టిందని, నిధులకు సమస్యలు లేనందున పనులలో వేగం పెంచాలని, అవసరమైన మేర అదనపు కార్మికులను ఏర్పాటుచేసి త్వరితగతిన యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సూచించారు.

సమీకృత కలెక్టరేట్‌లో భాగంగా పైప్‌లైన్, ప్లంబింగ్, కిటికీలు, సీలింగ్, ఫ్లోరింగ్, మొదటి అంతస్తు వరకు పెయింటింగ్ పనులు, ఎలక్ట్రికల్ పనులు, ఫౌంటేన్ డోర్స్, వాల్ సీలింగ్ పనులు పూర్తయ్యాయని, రెండవ అంతస్తు పెయింటింగ్, కాంపౌండ్ వాల్ ల్యాండ్ స్కేపింగ్ ఆర్చ్ పూర్తి కావాలని కలెక్టర్ తెలిపారు. నిర్మాణ పనులపై ప్రతి రోజు రివ్యూ నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో వచ్చే చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సకాలంలో పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అదనపు కలెక్టర్ వెంకటేశ్వ ర్లు, ఇంజనీర్లు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News