Friday, May 10, 2024

వాట్సాప్‌లో కూడా పెన్షన్ స్లిప్పులు

- Advertisement -
- Advertisement -

Pensioners can also view pension slip on WhatsApp

న్యూఢిల్లీ: పింఛన్‌దార్లు ఇకపై తమ పెన్షన్ స్లిప్పులను బ్యాంక్‌ల నుంచి వాట్సాప్‌ల్లో కూడా చూసుకోవచ్చు. వీటిని పొందవచ్చు. ఎస్‌ఎంఎస్, ఇమొయిల్ వంటివాటితో పాటు వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలకు కూడా ఈ స్లిప్పులు వెళ్లుతాయి. వీటిని పింఛన్‌దార్లు వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు అందుకునేందుకు సౌలభ్యం ఏర్పడుతుందని గురువారం వెలువడ్డ అధికారిక ఉత్తర్వులలో తెలిపారు. బ్యాంకు ఖాతాలలోకి పింఛన్ మొత్తాలు చేరిన వెంటనే సంబంధిత సమాచారం, ఎంత మొత్తం పెన్షన్ పడిందనేది తెలుసుకునేందుకు వీలేర్పడుతుంది. వయోవృద్ధులైన పింఛనుదార్లు తేలికగా ఈ వివరాలను తెలుసుకునేందుకు ఈ సౌకర్యం ఏర్పాటు చేశారు. సంబంధిత ఆదేశాలను పెన్షన్స్, పెన్షనర్స్ సంక్షేమ శాఖ తెలిపింది. పింఛనుదార్లకు ఎప్పటికప్పుడు అవసరం అయిన సమాచారాన్ని బ్యాంకర్లు అందించాల్సి ఉంటుంది. వారికి ఐటి, డిఎ, డిఆర్ వంటి కోతలు చెల్లింపులు వంటి వాటిని సమాచారంగా అందించేందుకు బ్యాంకులు ముందుకు రావడం మంచి పరిణామమని కేంద్ర ప్రభుత్వ సంబంధిత విభాగం తెలిపింది.

Pensioners can also view pension slip on WhatsApp

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News