Saturday, May 4, 2024

సెకండ్ వేవ్ కట్టడిలో యుపి గ్రేట్

- Advertisement -
- Advertisement -

UP control over second wave of Corona says PM Modi

యోగి ఆదిత్యానాథ్‌కు ప్రధాని కితాబు
వారణాసిలో రూ 1500 కోట్ల పనులు
జపాన్ సాయపు రుద్రాక్ష్ సెంటర్ ప్రారంభం

వారణాసి: సెకండ్ వేవ్ కోవిడ్‌ను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అణచివేసిందని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం కరోనాను బాగా కట్టడి చేస్తోందని , చర్యలు, నిర్వహణ తీరు బాగా ఉందని తెలిపారు. ప్రత్యేకించి దేశానికి ఇబ్బందికరంగా మారిన సెకండ్ వేవ్ దశలో యుపి అసాధారణ స్థాయిలో వ్యవహరించిందని, పరిస్థితిని అదుపులో పెట్టిందని చెప్పారు. తమ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో పర్యటించేందుకు ప్రధాని మోడీ గురువారం ఉదయం ఇక్కడికి వచ్చారు. యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ప్రగతి దిశలో పనిచేస్తోందని, అవినీతి, బంధుప్రీతిలేని చట్టపరమైన పాలన సాగిస్తోందని తెలిపారు. ఇక్కడి ఐఐటి బిహెచ్‌యూ గ్రౌండ్‌లో రూ 1500 కోట్ల వ్యయ అంచనాలతో కూడిన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

ఆ తరువాత ఆయన ఇక్కడ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్, కన్వెన్షన్ సెంటర్ రుద్రాక్ష్‌ను ప్రారంభించారు. జపాన్ సాయంతో వీటిని నిర్మించారు. యుపిలో జనాభా ఎక్కువ. కొన్ని దేశాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువ మంది నివసిస్తున్నారు. ఆదిత్యానాథ్ నాయకత్వపు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వైరస్ వ్యాప్తిని ఎక్కడికక్కడ అరికట్టారని ప్రధాని తెలిపారు. ఇంతకు ముందు యుపిలో మెదడువాపు వ్యాధి వంటివి సవాలుగా మారాయని, తరువాత ఇప్పుడు కరోనా ప్రపంచానికి ఈ ప్రాంతానికి సవాలుగా నిలిచిందని అన్నారు. వందేళ్లలో ప్రపంచం ఇటువంటి తీవ్రస్థాయి అనారోగ్యకర పరిస్థితిని ఇంతవరకూ ఎదుర్కోలేదన్నారు. ఇంతకు ముందు అతి తక్కువ స్థాయి వైద్య సమస్యలు తలెత్తినా సరైన ఆరోగ్య సౌకర్యాలు, ధృఢదీక్ష, చిత్తశుద్ధి లేకపోతే చిన్న సమస్యలే తీవ్రస్థాయి నష్టానికి దారితీసేవని ప్రధాని తెలిపారు. కరోనా వంటి తీవ్రస్థాయి సవాలును యుపి ప్రభుత్వం బాగా ఎదుర్కోవడం సాధారణ విషయం కాదన్నారు. వారణాసికి ప్రధాని మోడీ ఒక్కరోజు పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కాశీ విరామమెరుగని, నిలిచిపోవడం తెలియని స్రవంతి వంటిదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగా ఉందని కొనియాడారు. వారణాసి పర్యటన సందర్భంగా ప్రధాని వెంబడి గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సిఎం ఆదిత్యానాథ్, పలువురు రాష్ట్ర మంత్రులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News