Friday, April 26, 2024

దేశంలో తొలి గ్రీన్ ఫంగస్ కేసు

- Advertisement -
- Advertisement -

Person in Madhya Pradesh has symptoms of Green fungus

 

న్యూఢిల్లీ : దేశంలో మొదటిసారి గ్రీన్‌ఫంగస్ కేసు నమోదైంది. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ వ్యక్తిలో గ్రీన్‌ఫంగస్ లక్షణాలు కనిపించాయి. బ్లాక్, వైట్‌ఫంగస్‌ల కంటే ఈ ఫంగస్ ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు.అరబిందో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 34 ఏళ్ల వ్యక్తికి పరీక్షలు చేయగా, సైనస్, ఊపిరితిత్తుల్లో ఫంగస్ జాడలు కనిపించాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వెంటనే అతన్ని ముంబై లోని హిందూజా ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ వ్యక్తి ఊపిరి తిత్తుల్లో చీము నిండి ఉందని,దాన్ని తొలగించడానికి ప్రయత్నించినా విజయం కాలేదని, 103 డిగ్రీలు మించి జ్వరం ఉందని, వైద్యులు చెప్పారు. గ్రీన్‌ఫంగస్ ఊపిరితిత్తులకు వేగంగా సోకుతుందని వివరించారు. ఈ వ్యక్తి కొద్ది రోజుల కిందటే కరోనా నుంచి కోలుకున్నా మళ్లీ కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడు. ఊపిరితిత్తుల్లో 90 శాతం గ్రీన్‌ఫంగస్ ఉందని గుర్తించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News