Saturday, September 21, 2024

కరోనా వైరస్ ప్రభావంతో పెట్రోలు, డీజిల్ ధరల తగ్గుదల

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రభావానికి అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లలో డిమాండ్ మందగించడంతో బడ్జెట్ ప్రవేశపెట్టిన మరునాడు ఆదివారం పెట్రోలు, డీజిలు ధరల్లో తగ్గుదల కనిపించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్ ప్రకారం పెట్రోలు ధరలో 9 పైసలు, డీజిలు ధరలో 8 పైసలు తగ్గింది. ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.73.10, ముంబైలో రూ.78.75, కోల్‌కతాలో రూ.75.77, చెన్నైలో రూ.72.95గా ధరలు తగ్గాయి. అదే విధంగా ఢిల్లీలో లీటరు డీజిలు ధర రూ.66.14, ముంబైలో రూ.69.36, కోల్‌కతాలో రూ.68.54, చెన్నైలో రూ.69.89గా ధరలు తగ్గాయి. ప్రధాన నగరాల్లో ఈ విధంగా ధరలు నాలుగోసారి తగ్గాయి. అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్ ధరలు, రూపాయి, డాలరు మారకం రేటు ఆధారంగా రిటైల్ ధరలు ఉంటాయి.

Petrol Diesel prices decreased with Corona Effect

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News