Monday, April 29, 2024

దేవాలయాల ప్రాంగణాల్లో మొక్కలు నాటాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : జిల్లాలోని అర్బన్, రూరల్ ప్రాంతాల్లో దేవాలయాలలో, దేవాలయాల భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని స ంబంధిత శాఖలు చర్యలు తీసకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. శనివారం జూమ్ మీటింగ్ ద్వారా ఎండోమెంట్, మున్సిపల్ కమిషనర్స్, ఎంపిడిఓలు, ఎంపిఓలు, సంబంధిత జిల్లా అధికారులతో కలెక్టర్ జూమ్ ద్వారా మాట్లాడుతూ కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసే విధంగా యాక్షన్‌ప్లాన్ రూపొందించాలని కలెక్టర్ అన్నారు.

దేవాలయాల్లో మున్సిపల్ కమిషనర్లు, రూరల్ ప్రాంతాలలో గల దేవాలయాల్లో ఎ ంపిడిఓలు, ఎంపిఓలు హరితహార కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ఫారెస్ట్ నర్సరీలో లేదా ప్రైవేట్ నర్సరీలలోని పెద్ద మొక్కలను దేవాలయాలకు సంబంధించిన భూములలో నాటాలని, దేవాలయాల ఆవరణలో జమ్మి, రావి, పూల మొక్కలు నాటాలని కలెక్టర్ పేర్కొన్నారు. దేవాలయ ఆవరణలో మొక్కలు నాటి వాటి వద్ద భక్తులు సేద తీరేందుకు బల్లలు కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఖచ్చితమైన యాక్షన్‌ప్లాన్‌తో పటిష్టమైన చర్యలు చేపట్టి స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని పూర్తి చేసి అవార్డులు పొందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

గ్రామ పంచాయితీలలో అనువైన స్థలాలలో గోడలకు స్వచ్చ సర్వేక్షణ్ పెయింటింగులు పని చేపట్టాలని, మ్యాజిక్ సోఫిట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు సంబంధించిన రిజిస్టర్లను పెట్టుకోవాలని, గ్రామాల వారీగా విచారణలో భాగంగా కేంద్ర బృందం అభివృద్ధి పనులకు మార్కులు కేటాయించడం జరుగుతుందని, కావున అధికారులు పంచాయతీ కార్యదర్శులు ప్రతి పనిపై దృష్టి సారించాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పి సీఈఓ సురేష్ కుమార్, డిపిఓ యాదయ్య, ఎండోమె ంట్ కమిషనర్ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, డిఎఫ్‌ఓ సతీష్ కుమార్, ఎంపిడిఓ లు, ఎంపిఓలు, ఎండోమెంట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News