Wednesday, May 1, 2024

దూసుకుపోతున్న కృతిశెట్టి

- Advertisement -
- Advertisement -

Plenty offers in Tolly wood for Krithi shetty

 

తెలుగులో తన డెబ్యూ మూవీ ‘ఉప్పెన’తో భారీ హిట్‌ను అందుకొని అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ కృతిశెట్టి. ఈ యంగ్ హీరోయిన్ వచ్చిరాగానే టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేసింది. నిజానికి మొదటి సినిమాలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌లో పెర్ఫార్మన్స్ చేసిందంటే మరి ఇంకా ముందుముందు ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం క్రేజీ సినిమాలను లైన్‌లో పెట్టేసింది ఈ భామ. అయితే ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ఆమె క్యారెక్టర్స్ ‘ఉప్పెన’లోని బేబమ్మ పాత్రకు పూర్తి విరుద్ధంగా ఉంటాయని తెలిసింది. ఒకటి నానితో పీరియడిక్ ‘శ్యామ్ సింగరాయ్’ మూవీలో నటిస్తూనే.. హీరో సుధీర్ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాను ఓకే చేసింది.

అయితే ఈ సినిమాలో కృతి పక్కా హైదరాబాది అమ్మాయిగా కనిపించనుందని టాక్. దీంతో పాటు కృతి హీరో రామ్ సరసన ఓ సినిమా చేస్తోంది. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీలో కృతిశెట్టి ఎంపికైంది. అయితే ప్రస్తుతం ఈ మూడు సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలిపింది అమ్మడు. కానీ ఈ మధ్య ఇండస్ట్రీలో కృతి తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిందని పుకార్లు వైరల్ అవుతున్నాయి. తాజాగా కృతి ఆ పుకార్లకు చెక్ పెట్టేసింది. నిజంగానే ఆ వార్తలలో నిజం లేదని.. ఏదైనా ఉంటే తానే స్వయంగా వెల్లడిస్తానని ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా అందరూ మాస్కులు ధరించి ఆరోగ్యంగా ఉండాలని కృతి చెప్పుకొచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News