Saturday, April 27, 2024

అభివృద్ధిలో అందర్నీ భాగస్వాముల్ని చేయండి

- Advertisement -
- Advertisement -

PM Modi inaugurates BJP Mayors Conclave

బీజేపీ మేయర్లకు ప్రధాని మోడీ పిలుపు

న్యూఢిల్లీ : అందరితో కలిసి, అందరి అభివృద్ది, అందరి కృషి (సబ్ కా సాత్, సభ్‌కా వికాస్, సబ్‌కా ప్రయాస్ ) అనే భారతీయ జనతా పార్టీ నినాదాన్ని అనుసరించాలని ఆ పార్టీ మేయర్లకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మంగళవారం పిలుపునిచ్చారు. బీజేపీని యావత్తు దేశం విశ్వసిస్తోందని చెప్పారు. గుజరాత్ లోని గాంధీ నగర్‌లో మంగళవారం జరిగిన మేయర్లు, డిప్యూటీ మేయర్ల మండలి సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్సు ద్దారా మాట్లాడారు. స్వాతంత్య్ర అమృతోత్సవ కాలంలో రాబోయే 25 ఏళ్లలో పట్టణాభివృద్ధికి రోడ్ మ్యాప్ తయారీలో మేయర్లు కీలక పాత్ర పోషించాలన్నారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ మేయర్ గానే తన రాజకీయ జీవితం ప్రారంభించారని చెప్పారు. మెరుగైన భారత్ దేశం కోసం, అభివృద్ధి కోసం ఆయన అడుగు జాడల్లో నడవాలని మేయర్లకు పిలుపునిచ్చారు. అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలతో తన ప్రభుత్వాన్ని పోల్చి చెప్పారు. 2014 వరకు దేశంలో మెట్రో నెట్‌వర్క్ 250 కిమీ ఉండగా, నేడు ఈ నెట్‌వర్క్ దేశ వ్యాప్తంగా 775 కిమీ వరకు పెరిగిందన్నారు. టైర్2, టైర్3 నగరాలు ఇప్పుడు ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతున్నాయన్నారు. ఈ ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్స్‌ను ఉపయోగించడంలో చిన్న వ్యాపారులకు శిక్ష ఇవ్వాలన్నారు. ఇలాంటి అంశాల్లో మేయర్లు చొరవ తీసుకోవాలని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు హర్‌దీప్ సింగ్ పురి కూడా పాల్గొంటారని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News