Saturday, April 27, 2024

కుబేరతిల శివాలయంలో ప్రధాని మోడీ పూజలు

- Advertisement -
- Advertisement -

అయోధ్య: అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ మందిరం ఆవరణలోనే ఉన్న కుబేర్ తిల ప్రాంతాన్ని సందర్శించి అక్కడ శివుడికి పూజలు నిర్వహించారు. ప్రధాని శివలింగానికి జలాభిషేకం జరపడంతో పాటుగా ఆలయ పరిక్రమ( ప్రదక్షిణ) చేశారు. రామజన్మభూమి కాంప్లెక్స్‌లోని కుబేర్‌తిలలో ఉన్న పురాతన శివాలయాన్ని అయోధ్య రామజన్మభూమి తీర్థ్ క్షేత ట్రస్టు పునర్నిర్మిస్తోంది. ఆలయంలో పూజల అనంతరం ప్రధాని అక్కడ ఏర్పాటు చేసిన భారీ జటాయువు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

పర్ణశాలలో ఉన్న సీతాదేవిని అపహరించిన రాక్షస రాజు రావణాసురుడినుంచి సీతాదేవిని కాపాడడానికి చేసిన ప్రయత్నంలో రావణుడి చేతిలో పక్షిరాజయిన జటాయువు హతమైనట్లుగా రామాయణ గాథ. తన ప్రసంగంలో ప్రధాని జటాయువు అంకిత భావాన్ని కొనియాడుతూ, జటాయువుకు ఉన్న అంకిత భావాన్ని అందరూ అలవర్చుకుని అలాంటి నిబద్ధతే సమర్థవంతమైన దివ్యమైన భారత దేశ నిర్మాణానికి పునాది కావాలని సూచించారు. ఆ శివాలయానికి సమీపంలోని ‘సీతాకూప్’ పేరుతో పురాతన బావి కూడా ఉంది. ఆలయంతో పాటుగా ఈ బావిని కూడా ట్రస్టు పునరుద్ధరిస్తోంది.

నిర్మాణ కార్మికులపై పూలవర్షం
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రామమందిర నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులపై పూలవర్షం కురిపించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఎల్‌అండ్‌టి అయోధ్య ఆలయ నిర్మాణం జరిపిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News