Monday, April 29, 2024

రవాణాశాఖ మంత్రిని కలిసిన ఎఎంవిఐ అభ్యర్థులు…

- Advertisement -
- Advertisement -

న్యాయం జరిగేలా చూస్తా: రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకార్

మన తెలంగాణ / హైదరాబాద్:  సచివాలయంలోని తన ఛాంబర్ లో రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా వారు గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి కెటిఆర్ ట్వీట్ తో 6 నెలలు నోటిఫికేషన్ విత్ డ్రా చేసుకొని వారికి అనుకూలంగా ఉన్న వారికి లైసెన్స్ లో ఇప్పించి తిరిగి నోటిఫికేషన్ వేశారని వారు పిర్యాదు చేశారు.అంతే కాకుండా జరిగిన ఎక్సమ్ లో కూడా ఆటో మొబైల్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, వారు మంత్రి ముందు వాపోయారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జరిగిన ఎక్జామ్‌పై కేసు నమోదు కావడంతో డిప్లొమా ఆటో మొబైల్ నిపుణుల కమిటీ సలహాలు సూచనలు తీసుకొని ఎఎంవిఐ అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. కష్టపడే అభ్యర్థులకు ఫలితం వచ్చే విధంగా సర్వీస్ రూల్స్ కూడా మారుస్తామని మంత్రి ఈసందర్భంగా వారికి భరోసా ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News