Tuesday, April 30, 2024

డీప్‌ఫేక్ వీడియోలు సమాజానికి ప్రమాదకరం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న డీప్‌ఫేక్ ఫోటోలు, వీడియోలు సినీతారలు, సెలబ్రిటీలను తీవ్రకలవరపాటుకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో స్పందించారు. కృత్రి మేధను ఉపయోగించి దుర్వినియోగం చేసి ఇలా డీప్‌ఫేక్ వీడిలు సృష్టించడం సమస్యాత్మకం, ఆందోళనకరమని అన్నారు. ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన దీవాలీ మిలన్ కార్యక్రమంలో ప్రధాని దీనిపై స్పందించారు.‘డీప్‌ఫేక్ వీడియోలు మన వ్యవస్థకు పెనుముప్పుగా మారుతున్నాయి. ఇవి సమాజంలో గందరగోళాకి కారణమవుతున్నాయి. ఇటీవల నేను నృత్యం చేస్తూ పాట పాడినట్లుగా ఓ వీడియో వైరల్ అయింది. తెలిసిన వాళ్లు కొందరు దాన్ని నాకు ఫార్వర్డ్ చేశారు. ఈ డీప్‌ఫేక్ వీడియోలపై మీడియా, జర్నలిస్టులు ప్రజలకు తప్పనిసరిగా అవగాహన కల్పించాలి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత వల్ల ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి.వాటినుంచి ఎలా అప్రమత్తగా ఉండాలన్నదానిపై అవగాహన కల్పించాలి’ అని మోడీ వ్యాఖ్యానించారు.

ఇలాంటి వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయినప్పుడు వాటిని ప్లాగ్ చేసి వార్నింగ్ ఇవ్వాలని చాట్‌జిపిటి బృందాన్ని తాను కోరినట్లు ప్రధాని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇటీవల నటి రష్మిక మందనకు చెందిన ఓ డీప్‌ఫోక్ వీడియో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్ నటీమణులు కత్రినా కైఫ్, కాజోల్‌లు కూడా ఈ డీప్‌ఫేక్ బారిన పడ్డారు. దీంతో ఈ వీడియోలపై నెటిజన్లు, సినీతారలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కేంద్రం దీనిపై స్పందిస్తూ మారింగ్ ఫోటోలు, వీడియోలపై ఎక్స్( ట్విట్టర్) , ఇన్‌స్టాగ్రామ్,ఫేస్‌బుక్ తదితర సంస్థలకు మార్గదర్శకాలను జారీ చేసింది.మార్ఫింగ్ ఫోటోలపై ఫిర్యాదు అందిన 36 గంటల్లోగా వాటిని తొలగించాలని సామాజిక మాధ్యమాలను కేంద్రం ఆదేశించింది.నిబంధనలను పాటించని సంస్థలపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఎవరైనా ఏదయినా కమ్యూనికేషన్ పరికరాన్ని లేదా కంప్యూర్ రిసోర్స్‌ను ఉపయోగించి వ్యక్తులను మోసం చేస్తే మూడు సంవత్సరా దాకా జైలుశిక్ష, లక్ష రూపాయల దాకా జరిమానాపడుతుందని హెచ్చరించింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీప్‌ఫేక్‌లు ప్రజాస్వామ్య సమగ్రతకు సవాళ్లు విసురుతున్నాయి. నకిలీ, నిజమైన క్లిప్‌ల మధ్య తేడాలను గుర్తించడం కష్టతరం చేస్తోంది. రాజకీయ నాయకులను లక్షంగా చేసుకుని చిత్రాలు, నకిలీ వీడియోలను సృష్టిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News