Saturday, May 11, 2024

మోడీ భావోద్వేగం

- Advertisement -
- Advertisement -

pm modi's emotional tribute to died of covid-19

 

కరోనా మృతులను గుర్తుచేసుకొని కన్నీటిపర్యంతమైన ప్రధాని
వారణాసి డాక్టర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లతో వర్చువల్ భేటీ
మరో కొత్త సవాలు రూపంలో బ్లాక్ ఫంగస్

వారణాసి/లక్నో: దేశంలో కరోనా మహమ్మారి నిత్యం వేలాది మందిని బలి తీసుకోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఉత్త్రప్రదేశ్‌లోని తన లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసికి చెందిన డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలతో ప్రధాని శుక్రవారం వర్చువల్‌గా సమావేశమైనారు. ఈ సందర్భంగా కరోనా మృతులను గుర్తు చేసుకుని బాధపడ్డారు. ‘ఈ వైరస్ మన చుట్టూ ఉండే ఎంతో మంది ప్రియతములను మననుంచి తీసుకెళ్లింది. వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని మోడీ గద్గద స్వరంతో అన్నారు. డాక్టర్లు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి కొవిడ్‌పై పోరాటం చేస్తున్నారన్నారు. అందరి సమిష్టి కృషితో ఈ పోరాటంలో కొంత మేరకు విజయం సాధించినప్పటికీ సంతృప్తి చెందడానికి ఇది సమయం కాదన్నారు. మనం సుదీర్ఘ పోరాటం చేయాల్సి ఉందన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని ఎక్కడ రోగి ఉన్నాడో అక్కడే చికిత్స అందించాలన్న కొత్త నినాదాన్ని ఇచ్చారు. ‘ జహా బీమార్.. వహీ ఉపచార్’ అనే విషయాన్ని మనం మరిచి పోకూడదు. చికిత్స జబ్బుపడితే అది మొత్తం ఆరోగ్య వ్యవస్థపైనే ఒత్తిడి తీసుకు వస్తుంది అని మోడీ అన్నారు. కరోనా మహమ్మారినుంచి చిన్నారులను కాపాడడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు. అంతే కాకుండా ‘బ్లాక్ ఫంగస్’ను కొత్త సవాలుగా ఆయన అభివర్ణించారు. సెకండ్ వేవ్‌లో అన్ని రంగాల్లోను పోరాటం చేయాల్సి వచ్చిందన్న ప్రధాని వైరస్ సోకే రేటు చాలా ఎక్కువగా ఉందని, రోగులు ఎక్కువ కాలం ఆస్పత్రిలో ఉండాల్సి రావడంతో వైద్య వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి ఉందన్నారు. అందరికీ టీకా అందించాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కి చెబుతూ, ఫ్రంట్‌లైన్ వర్కర్లు టీకా కారణంగానే ఎలాంటి భయం లేకుండా సేవలందించగలుగుతున్నారన్నారు. ఈ ‘సురక్షా కవచం’ అందరికీ చేరాలని అన్నారు.

 

pm modi’s emotional tribute to died of covid-19

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News