Monday, April 29, 2024

చైనాలో అంతు చిక్కని వ్యాధి… వందల సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరిన చిన్నారులు

- Advertisement -
- Advertisement -

బీజింగ్: చైనాలో అంతు చిక్కని వ్యాధితో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. బుధవారం ఒక్క రోజు బీజింగ్, లియనోనింగ్ ప్రాంతాల్లో వివిధ ఆస్పత్రులు చిన్నారులతో నిండిపోయింది. అంతు చిక్కని న్యూమోనియా వ్యాధితో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారని ప్రొమైడ్ అనే సంస్థ అందరినీ అప్రమత్తం చేసింది.  చిన్నారులు ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్, శ్వాస సంబంధమైన సమస్యలతో పాటు జ్వరంతో కూడా ఇబ్బందిపడుతున్నారు. దగ్గు లేకపోవడంతో వ్యాధి లక్షణాలు గుర్తించడం కొంచెం కష్టంగా ఉంది. వందల సంఖ్యలో చిన్నారులతో ఆస్పత్రులు నిండిపోయాయి. స్కూళ్లలో ఒకరి నుంచి ఒకరికి విద్యార్థులకు సోకినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది,. స్కూళ్లలో ఉన్న టీచర్లకు కూడా ఈ వ్యాధి సోకినట్టు గుర్తించారు. పాఠశాలలు మూసివేశారని ప్రొమెడ్ సంస్థ తన ట్విట్టర్‌లో వెల్లడించింది.

కరోనా వైరస్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలు తరచుగా అంటు వ్యాధులకు గురవుతున్నారని వైద్య శాఖ వెల్లడించింది. ఉత్తర చైనాలో అంతుచిక్కని న్యూమోనియాతో చిన్నారులు ఇబ్బందిపడుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సోషల్ మీడియాలో స్పందించింది. జబ్బు లక్షణాలు, అనారోగ్యానికి గురవుతున్న చిన్నారులు ఉండే ప్రాంతం వివరాలు తమకు అందజేయాలని ప్రభుత్వాలను కోరింది. జబ్బు వ్యాప్తి చెందకుండా చైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 70 లక్షల మంది బలి తీసుకున్న విషయం తెలిసిందే. అధికారంగా 70 లక్షలే కానీ అనాధికారికంగా రెండు కోట్ల మంది వరకు చనిపోయి ఉంటారని మీడియా వర్గాలు అంచనా వేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News