Home జనగామ పోలీస్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్‌…. రేపు అర్హత పరీక్ష

పోలీస్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్‌…. రేపు అర్హత పరీక్ష

ts-police

మన తెలంగాణా/జఫర్‌గడ్ : వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకుగాను పోలీసుల ఆధ్వర్యంలో ఉచితంగా అందించే కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గురువారం రాయపర్తి మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల నందు అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎస్సై కె కిషోర్ బుధవారం తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఎస్ఐ తెలిపారు. ఒంటి గంట నుంచి ఎగ్జామ్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.