Monday, April 29, 2024

కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

Police Restrictions on Durgam Cheruvu Cable Bridge

హైదరాబాద్: దుర్గం చెరువుపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి సమీపంలో పలు ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. బ్రిడ్జిని జూబ్లీహిల్స్ నుంచి హైటెక్‌సిటీ, గచ్చిబౌలికి డైరెక్ట్‌గా కనెక్టివిటీ కోసం నిర్మించారని పేర్కొన్నారు. బ్రిడ్జిని చూసేందుకు చాలా మంది సందర్శకులు వస్తున్నారని, రోడ్లపై అడ్డంగా నిలుచుని ఫొటోలు దిగుతున్నారని, రోడ్డు క్రాస్ చేస్తున్నారని తెలిపారు. వారాంతంలో సందర్శకులను అనుమతిస్తూ జిహెచ్‌ఎంసి నిర్ణయం తీసుకుందని తెలిపారు. రోడ్డు భద్రత, ప్రజల భద్రత కోసం కింది నిబంధనలు విధించారు.

పార్కింగ్ ప్రాంతాలు…

ఐటిసి కోహినూర్ వెనుక, రోడ్డు నంబర్ 45 కేబుల్ బ్రిడ్జి కింద, మస్తాన్ నగర్ బ్రిడ్జి కింద వాహనాలను పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. గచ్చిబౌలి, నార్సింగి, మియాపూర్, మాదాపూర్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చే పార్కింగ్ ప్రాంతం నుంచి మైండ్‌స్పేస్ రోటరీ, నోవార్టీస్, సాలార్‌పూరియా సత్వా, హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ పార్కింగ్ ప్లేస్ నుంచి వెళ్లాలి. డిసిబి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, మెహిదిపట్నం, బేగంపేట నుంచి వచ్చే వారు రోడ్డు నంబర్ 45 నుంచి డిసిబి వైపు వెళ్లాలి.

విధించిన నిబంధనలు ఇవే..

వాహనాల రాకపోకలను శుక్రవారం రాత్రి 10 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు బ్రిడ్జిని మూసివేయనున్నారు.
మిగతా రోజుల్లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు మూసివేయనున్నారు.

1. బ్రిడ్జిపై నడవడం నిషేధం, బ్రిడ్జిపై రోడ్డు క్రాస్ చేయడం నిషేధించారు.
2. రోడ్డు సైడ్‌కు ఉన్న రేయిలింగ్‌పై కూర్చోవడం, నిలబడడం నిషేధం.
3. వాహనాలను బ్రిడ్జిపై పార్కింగ్ చేయకూడదు.
4. బ్రిడ్జిపై గుంపులుగా ఉండడం, పుట్టిన రోజు వేడకులు చేసుకోవడం నిషేధం.
5. బ్రిడ్జిపై భారీ వాహనాలను నిషేధించారు. ట్రాక్టర్లు, లారీలు, డిసిఎంలు, గూడ్స్ ఆటోలు, జెసిబిలు, క్రేన్లు తదితరాలను నిషేధించారు.
6. బ్రిడ్జిపై వాహనాలను 35కిలో మీటర్ల స్పీడ్ కంటే వేగంగా వెళ్లకూడదు.
7. బ్రిడ్జిపై మద్యపానం సేవించడం నిషేధం.
8. మాదాపూర్, రోడ్డు నంబర్ 45 నుంచి వచ్చే వాహనాలను వారాంతంలో దారి మళ్లించనున్నారు.
9. బ్రిడ్జికి ఇరువైపులా పార్కింగ్ కోసం ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News