Saturday, April 27, 2024

జడ్చర్లలో కారు హుషారు..హస్తం బేజారు!

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్ బ్యూరో ః జడ్చర్ల నియోజకవర్గంలో కారు పార్టీ హుషారుగా ఉండగా, హస్తం పార్టీ బేజారుగా ఉంటోంది. ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అడ్డదారులకు చెక్ పడుతోంది. ఓట్లర్లను డబ్బులతో ప్రలోభాలకు గురి చేయాలని కాంగ్రెస్ వేసిన ఎత్తుగడ చిత్తు అయ్యింది. హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ గ్రేస్ అపార్ట్‌మెంట్ నుంచి ముగ్గురు వ్యక్తులు కారులో వెళ్తుండగా అనుమానించిన పోలీసులు తనఖీ చేయడంతో రూ. 1 కోటి 68 లక్షలు పట్టుబడ్డాయి. ఈ డబ్బులు జడ్చర్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అనురుధ్ రెడ్డివిగా పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ వ్యవహారం జడ్చర్ల నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు హైదరాబాద్ నుంచి తరలిస్తున్న క్రమంలో పట్టుబడినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో జడ్చర్ల నియోజకవర్గంలో ఇప్పటికే మూడు సార్లు గెలిచి నాల్గవ సారి విజయం కోసం ఎదురు చూస్తున్న బిఆర్‌ఎస్ అభ్యర్థ్ధి లకా్ష్మరెడ్డి విజయం సులభమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

డబ్బుల మూటలను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో అంతటితో ఆగని అనురుధ్ రెడ్డి తమను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారంటూ కొత్త డ్రామాకు తెరలేపారు. పోలీసులు ఎలంటి హౌస్ అరెస్ట్ చేయకున్నా సోషల్ మీడియా వేదికగా ఈ తప్పుడు ప్రచారం చేసుకోవడంపై నియోజకవర్గ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి అనురుధ్ రెడ్డి కత్తి విడిచి నేలపై సాము చేసినట్లు ప్రజల్లోకి వెళ్లకుండా గాలిలో గెలుస్తాములే అనే ఊహాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత పోల్ మేనేజ్‌మెంట్ చేసుకోవాల్సింది పోయి డబ్బులతో కాంగ్రెస్ గెలిచేందుకు ప్రయత్నాలు చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు గెలిచి కీలకమైన మంత్రి పదవులు చేపట్టిన లకా్ష్మరెడ్డి జడ్చర్లతో పాటు తండాలను,గ్రామాలలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దారు. సిసి రోడ్లు, బిటి రోడ్లు, రైతు బీమా,రైతు బంధు,కళ్యాణణి లక్ష్మి,షాదీ ముబారక్, సిఎంఆర్‌ఎప్ చెక్కుల పంపిణీ,దళిత బంధు,బిసి బంధు,గొర్రెల పంపిణీ వంటి సంక్షేమ పథకాలతో పాటు చేసిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి.

పోలేపల్లి సెజ్‌ను ఏర్పాటు చేసి వందలాది పరిశ్రమలు ఏర్పాటు చేయించి వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగు పర్చాడు. వ్యక్తిగతంగా లకా్ష్మరెడ్డికి మంచి వ్యక్తిగా, వివాదరహితునిగా ప్రజల్లో పేరుంది. ఆయన్న ప్రజలు లక్ష్మణ అని సంబోధిస్తుంటారు. ఇలా ఆయన ప్రజల్లో ఒకరిగా వారి ఇంటిలో సభ్యుడిగా ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ చెప్పకునేందుకు ఎలాంటి అభివృద్ధి పనులు కనిపించడం లేదు. బిఆర్‌ఎస్ వచ్చిన తర్వాతనే ఉదండాపూర్ రిజర్వాయర్ వచ్చింది. జడ్చర్లలో రహదారులు అందంగా ముస్తాబై ఉన్నాయి. ఇలా అన్ని రంగాల్లోనూ జడ్చర్ల ముందుకు సాగుతోంది.అందుక బిఆర్‌ఎస్ చేపట్టిన అభివృద్ధే అన్నది ప్రజల టాక్. అందుకే లక్ష్మణ ప్రజలకు చేసిన సేవలకు తాను గెలుస్తానని దీమాలో ఉన్నారు.

దేవరకద్రలోనూ కారుదే జోరు ః
దేవరకద్రలోనూ కారుదే జోరు కనిపిస్తోంది. అక్కడి బిఆర్‌ఎస్ నుంచి పోటీలో ఉన్న ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఇప్పటికే రెండు సార్లు గెలిచి హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ పథకాలే విజయ తీరాలకు తీసుకెళ్తాయని ఆయన నమ్మకంతో ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత ప్రదీప్ గౌడ్ బిఆర్‌ఎస్‌లో చేరడంతో బిఆర్‌ఎస్ మరింత బలపడినట్లు చెబుతున్నారు. ఎవరు ఎలాంటి సహాయం కావాలన్నా అడిగిన వెంటనే తనకు తోచిన సహాయం చేసే గుణం ఉన్న ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఏ కష్టం వచ్చినా తమకు ఎమ్మెల్యే ఉన్నాడన్న భరోసా కల్పిస్తూ వచ్చారు. ఎక్కడా ఎలాంటి దందాలు,కబ్జాలు వంటి ఆరోపణలు లేకుండా మంచి పేరు తెచ్చుకున్న నేతగా పేరుంది. చెరువులు, చెక్ డ్యాంలు నిర్మించి రైతులకు సాగునీరు అందించిన మిషన్ అపర భగీరథుడిగా ఆయనకు పేరుంది. సిఎం, కెసిఆర్,కెటిఆర్‌ల ప్రశంసలు కూడా ఆల పొందారు. కాంగ్రెస్ కేవలం గ్యాసిప్స్, మౌత్ ప్రచారంతో గెలుస్తామని గాలిలో మేడలు కడుతోంది.ఏది ఏమైనా నేటితో ఎవరి సత్తా ఏమిటన్నది తేలనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News