Friday, April 26, 2024

దాతల సహాయం కోసం నిరుపేద క్రీడాకారుడు

- Advertisement -
- Advertisement -

గోవాలో జరిగే నేషనల్ కబడ్డీ పోటీలకు ఎంపికైన జంపన్న
ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపులు
సహాయం చేస్తే..గోవాలో రాణిస్తానంటున్న జంపన్న

ఆ యువకుడు పుట్టింది నిరుపేద కుటుంబం ఆయన ఎక్కడ కూడా నిరాశ చెందలేదు ప్రభుత్వ పాఠశాల్లో చదువుతూ కబడ్డీ ఆటపై అమితాసక్తి పెంచుకున్నాడు. పట్టువదలని విక్రమార్కుడిలా సాధనా చేశాడు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుల శిక్షణ, ప్రోత్సాహంతో మండల, జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో సత్తచాటి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటిల్లో సైతం రాణించాడు. త్వరలో గోవాలో జరిగే నేషనల్ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. కడుబీద కుటుంబంలో పుట్టిన జంపన్నకు గోవా వెల్లడానికి రవాణా ఖర్చులు లేక దాతల ఆర్థిక సహాయం కోరుతున్నాడు .ఆర్థిక సహాయం అందిస్తే గోవాలో సైతం సత్తాచాటి వస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. సాయం కోసం అర్జిస్తున్న ఓ క్రీడాకారుడిపై‘మన తెలంగాణ’ప్రత్యేక కథనం

Poor athlete wait for donor help
మన తెలంగాణ/బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని గోపాలపురం గ్రామానికి చెందిన ఈసం నాగేశ్వరరావు, ఆదెమ్మ దంపతుల కుమారుడు జంపన్న నిరుపేద కుటుంబంలో జన్మించిన జంపన్న చిన్ననాటి నుండి సర్కార్ బడిలోనే విద్యను అభ్యసించాడు. క్రీడలపై మక్కువ కలిగిన అతడు కబడ్డీ ఆటపై అమితాసక్తిని పెంచుకున్నాడు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుల శిక్షణ, ప్రోత్సహంతో స్కూల్‌స్థాయి పోటీల్లో బాగా రాణించేవాడు. ఎప్పటికప్పుడు తన ప్రతిభకు పదును పెడుతూ మండలం, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని అత్యంత ప్రతిభను కనబరిచి త్వరలో గోవాలో జరిగే నేషనల్ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. జంపన్నది నిరుపేద కుటుంబం తల్లిదండ్రులు కూలీపనులకు వెళితేనే పూటగడుస్తుంది. త్వరలో గోవాలో జరిగే నేషనల్ కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు రవాణా ఖర్చులు లేక జంపన్న కలతచెందుతున్నాడు. అందివచ్చిన అవకాశం చేయి జరిపోతుందేమోనని మదన పడుతున్నాడు. దాతల ఆర్థికం సహాయం కోరుతున్నాడు. దాతలు కరుణించి ఆర్థిక ప్రోత్సహం అందిస్తే గోవాలో సైతం సత్త చాటుతానని ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. దాతలు ముందుకు వచ్చి తనకు సహాయం చేయాలని వేడుకుంటున్నాడు. సహృదయం గల దాతలు స్పందించి తన ఫోన్ నంబర్ 9000752865కు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా సహాయం చేయాలని కోరుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News