Monday, April 29, 2024

హ్యాండ్‌సమ్ లుక్‌లో..!

- Advertisement -
- Advertisement -

Prabhas act in radhe shyam
ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా నుంచి తాజాగా సంచారి సాంగ్ టీజర్ విడుదలైంది. జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతం అందించారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సాంగ్ టీజర్ వైరల్ అవుతోంది. పూర్తి పాట ఈనెల 16న విడుదల కానుంది. పాటలో అద్భుతమైన విజువల్స్ కనిపిస్తున్నాయి. ఈ పాటలో ప్రభాస్ చాలా హ్యాండ్‌సమ్‌గా ఉన్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వర్షన్స్‌కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News