Sunday, May 5, 2024

బర్త్‌డే కామన్ డిపితో హల్‌చల్

- Advertisement -
- Advertisement -

Prabhas birthday common dp

ఆల్ ఇండియా సూపర్ స్టార్ క్రేజ్ తో దూసుకు పోతున్న ప్రభాస్ పుట్టిన రోజుకు మరో 50 రోజులు ఉంది. అప్పుడే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావుడి మొదలు పెట్టారు. ప్రభాస్ పుట్టిన రోజు మరో 50 రోజులు ఉండగానే కామన్ డీపీని విడుదల చేశారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆ రోజున ‘రాధే శ్యామ్’ టీజర్ లేదా మేకింగ్ వీడియోను విడుదల చేయబోతున్నారు. నాగ్ అశ్విన్, ‘ఆదిపురుష్’ల సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రభాస్ బర్త్ డే కామన్ డీపీతో ఫ్యాన్స్‌కు కానుక వచ్చింది. ‘బాహుబలి’లోని స్టిల్‌ను ఉపయోగించి ప్రభాస్ ‘ఈశ్వర్’ సినిమా నుండి ‘రాధేశ్యామ్’ సినిమా వరకు టైటిల్స్‌ను డిజైన్‌లో ఉంచడం జరిగింది. ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా డిజైన్ చేశారు. ప్రభాస్ చిరునవ్వులు చిందిస్తూ మైమరపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా స్టార్ బర్త్‌డే కామన్ డీపీతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News