Friday, May 10, 2024

సమ్ థింగ్ స్పెషల్ గా మ్యూజిక్

- Advertisement -
- Advertisement -

Some thing special music in Vakeel saab

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘వకీల్ సాబ్’పై ఎన్ని అంచనాలు ఉన్నాయో తెలిసిందే. ఈపాటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఇక దర్శకుడు శ్రీరామ్ వేణు, సంగీత దర్శకుడు తమన్, నిర్మాత దిల్ రాజులు మొదటిసారి పవన్‌తో వర్క్ చేస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి సంబంధించి ప్రతి అంశాన్ని స్పెషల్‌గా చేస్తున్నారు. ముఖ్యంగా సంగీతం విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పాలి. ‘మగువా మగువా’ సాంగ్ నుంచి లేటెస్ట్ టీజర్‌లోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వరకు తమన్ చాలా ఫ్రెష్ ట్యూన్స్ ఇచ్చారు. అలాగే ఈ సినిమా ఆల్బమ్‌ను కూడా అవుట్ స్టాండింగ్‌గా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రానికి ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యాన్ని అందించాడని తమన్ అంటున్నాడు. దీనిని బట్టి ‘వకీల్ సాబ్’తో పవన్ కెరీర్‌లో మరో మంచి ఆల్బమ్ రావడం ఖాయమని చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News