Home తాజా వార్తలు అదే నా ధ్యేయం

అదే నా ధ్యేయం

Prakash Raj said his aim to raise Rs 10 cr for 'MAA' welfare fund

 

‘మా’ ఎన్నికలలో గెలిస్తే 6 నెలల్లోనే రూ. 10 కోట్ల ‘మా’ వెల్ఫేర్ ఫండ్‌ని సేకరించడమే తన ధ్యేయమని ప్రకాశ్ రాజ్ తెలిపారు. దీని కోసం తన దగ్గర అనేక మార్గాలున్నాయని చెప్పారు. అక్టోబర్ 10న జరగనున్న ‘మా’ ఎన్నికలలో సిని‘మా’ బిడ్డలం ప్యానల్ నుంచి అధ్యక్షుడిగా ప్రకాశ్ రాజ్ బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ‘మా’ సభ్యులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ “మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలవగానే 6 నెలల్లోనే మేము రూ. 10 కోట్ల ‘మా’ వెల్ఫేర్ ఫండ్‌ను సేకరిస్తాం. ఇవ్వడానికి మనుషులు సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ‘మా’ కోసం మాస్ట్రో ఇళయరాజాతో కన్సర్ట్ చేయిస్తాను. ఈ విషయమై ఇప్పటికే ఇళయరాజాతో మాట్లాడాను. డిసెంబర్‌లో ‘మా’ కోసం ఆయన పోగ్రామ్ చేస్తానని అన్నారు. ఈ కన్సర్ట్‌లో చిత్ర, హరిహరన్ వంటి సింగర్స్ పాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక 100 మంది వైద్యులతో క్లబ్ ఏర్పాటు చేస్తాం. ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మూడు నెలల్లో ‘మా’ అసోసియేషన్ ఆఫీస్‌లో ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డు ఉంటుంది”అని అన్నారు.