Thursday, May 9, 2024

అఫ్గాన్‌లో ఎన్నికలకు పిలుపునిచ్చిన ఇరాన్ అధ్యక్షుడు

- Advertisement -
- Advertisement -

President of Iran calls for elections in Afghanistan

 

తెహ్రాన్ : అఫ్గానిస్థాన్ దేశ భవిష్యత్తును నిర్ణయించడానికి వీలుగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పిలుపునిచ్చారు. అమెరికా భద్రతా దళాలు వైదొలగి, తాలిబన్లు దేశాన్ని తమ నియంత్రణ లోకి తీసుకొచ్చిన తరువాత శాంతి భద్రతలు తిరిగి నెలకొనగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రభుత్వ టివి ఛానల్‌లో ఆయన మాట్లాడుతూ వీలైనంత త్వరగా అఫ్గాన్ ప్రజలు ఓటు ద్వారా తమ ప్రభుత్వాన్ని నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల అభీష్టం ప్రకారం ఓటు ద్వారా ప్రభుత్వం ఏర్పడాలని ఆయన అభిలషించారు. అఫ్గాన్ ప్రజల శాంతి భద్రతలకు తమ దేశం ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News