Friday, April 26, 2024

వినియోగదారులు ఇవి తెలుసుకోవాలి!

- Advertisement -
- Advertisement -

Budget Advertising

 

ముంబై: దేశీయ కంపెనీలకు ప్రోత్సాహం అందించేందుకు గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో పలు ప్రకటనలు చేశారు. టేబుల్‌వేర్, కిచెన్‌వేర్ నుంచి ఎలక్ట్రికల్ వస్తువులు, ఫుట్‌వేర్, ఫర్నిచర్, స్టేషనరీ, బొమ్మలు వంటి వివిధ వస్తువులపై కస్టమ్ సుంకాన్ని పెంచారు. దీని ఫలితంగా కొన్ని ఉత్పత్తుల ధరలు మరింత పెరగనున్నాయి.

చైనా వస్తువులే లక్ష్యం
2020-21 బడ్జెట్‌లో మేక్ ఇన్ ఇండియా కింద భారతదేశంలో ఉత్పత్తిని పెంచడానికి, మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రయత్నం చేశారు. ఇందుకోసం వివిధ వస్తువులు, పరికరాలపై దిగుమతి సుంకాన్ని పెంచారు. ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ వస్తువులు, సామగ్రిలో ఎక్కువ భాగం చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగానికి చెందినవి. ఈ చర్య చైనా ఆధిపత్యానికి సవాలు గా మారనుంది. మేక్ ఇన్ ఇండియా చొరవ కోసం మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, సంబంధిత పరికరాలపై కస్టమ్స్ సుంకం విధించినట్లు బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ పేర్కొన్నారు. భారతదేశంలో ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో ఈ ప్రకటన చేశారు.

మేక్ ఇన్ ఇండియాకు ప్రోత్సాహం
మేక్ ఇన్ ఇండియాకు ప్రభుత్వం అత్యంత ప్రోత్సాహం ఇస్తోంది. దీనిలో భాగంగానే ఎంఎస్‌ఎంఇ బలం అవసరమని భావించింది. దేశీయ ఎంఎస్‌ఎంఇ రంగం పరిశ్రమలకు వెన్నెముక, మేక్ ఇండియా ఇండియా ప్రభుత్వ నివేదిక ప్రకారం ఈ విభాగంలోకి 5.10 కోట్ల యూనిట్లు వస్తాయి. 11.7 కోట్ల మందికి ఉపాధి లభిస్తోంది. దేశ జిడిపికి ఏడు శాతం తోడ్పడుతోంది. దేశం మొత్తం ఉత్పత్తికి 45 శాతం సహకారం. 40 శాతం ఎగుమతులు కూడా భారతదేశం నుండి చేస్తున్నాయి. దేశం ప్రతి సంవత్సరం 30 కోట్ల ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీలు (పిసిబిఎ) లేదా మదర్‌బోర్డులను వినియోగిస్తుంది. వీటిని ఎక్కువగా ఫోన్‌లలో ఉపయోగిస్తారు. వీటిలో 16 కోట్లు భారతదేశంలో తయారవుతున్నాయి. మిగిలినవి దిగుమతి అవుతున్నాయి. దీని విలువ సుమారు 6 వేల కోట్లు. దిగుమతుల్లో ఎక్కువ భాగం చైనా నుండే ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, భారత ప్రభుత్వం వీటిపై దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా భారతదేశంలో గరిష్ట ఉత్పత్తి ఉంటుంది.

వీటి ధరలు పెరుగుతాయ్..
-బేబీ హెల్త్, అండ్ హ్యాపీనెస్ ఇకపై మరింత వ్యయభరితం కానుంది. నెస్లె నాన్ ప్రో విలువ రూ.1200 నుంచి రూ.1340కు పెరగనుంది. బార్బీ బొమ్మ ధర రూ.1200 ఉంటే, దీనికి అదనంగా రూ.800 చెల్లించాల్సి రావొచ్చు.
-మానసిక ఆరోగ్యానికి వాల్‌నట్స్, శారీరక ఆరోగ్యానికి సంబంధించిన ఫుట్‌వేర్‌ల ధరలు ప్రియం కానున్నాయి. కాలిఫోర్నియా నుంచి దిగుమతి చేసుకునే వాల్‌నట్స్ కిలో రూ.850 నుంచి రూ.1280కి పెరగవచ్చు. నైక్ షూలు రూ.8,999 నుంచి రూ.9,749కి పెరగవచ్చు.
-మాట్రెస్, సోఫా బెడ్, ఎల్‌ఇడి లైట్స్, ఫర్నిచర్‌లపై దిగుమతి సుంకం పెరగనుంది. ఐకియా నుంచి దిగుమతి చేసిన మాట్రెస్ కొంటే ఇప్పుడున్న రూ.51,990 నుంచి రూ.54,349 పెరిగే అవకాశముంది.
-విరాట్ కొహ్లి లాగా హెయిర్‌స్టైల్ ఉండాలనుకునే వారు కోర్డ్‌లెస్ మాజిక్ క్లిప్పర్‌కు మరింత ఎక్కువ చెల్లించాల్సిందే. దీని ధర రూ.9000 నుంచి రూ.9,890కి పెరగనుంది. దీనికి కారణం హెయిర్ డ్రైయర్, హెయిర్ రిమూవర్, క్లిప్పర్, షేవర్, స్మూథింగ్ ఐరన్, బ్లోవర్లు వంటి వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచారు.

Prices of these items increase with Budget Advertising
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News