Tuesday, May 14, 2024

ప్రైవేటు బడుల్లో ప్రతి ఏటా ఫీజుల భారం…

- Advertisement -
- Advertisement -

10శాతం పెంపు అనుమతికి విద్యశాఖపై ఒత్తిడి
కరోనా వైరస్‌తో ఆర్ధికంగా దెబ్బతిన్నామని కొత్త ఎత్తులు
ప్రభుత్వం అమలు చేస్తే నష్టాలు ఉండవంటున్న యాజమాన్యాలు
పేద, మధ్యతరగతి విద్యార్థులు ప్రైవేటు చదువులకు దూరమయ్యే పరిస్దితి
వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేసేందుకు యాజమాన్యాలు ప్రయత్నాలు

Private school fees increased every year

 

మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలోని ప్రైవేటు స్కూళ్లో చదువులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరింత ఖరీదు కానున్నాయి. పేద, మధ్యతరగతికి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేకుండా పోతుంది. నెల రోజుల కితం మంత్రుల కమిటీ ప్రతి సంవత్సరం 10శాతం వరకు ఫీజులు పెంచుకునే విధంగా ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతంలో ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కోసం ప్రొపెసర్ తిరుమలరావు కమిటీ వేసింది. అడ్డుగోలు ఫీజుల వసూలు చేయకుండా పలు సూచనలు చేసింది. దీనికి లోబడి ప్రైవేటు బడులు ఫీజులు వసూలు చేయాలని విద్యాశాఖ పేర్కొంది. గత రెండేళ్లు కరోనా ప్రభావంతో పాఠశాలలు మూతవేయడంతో ఆశించిన స్దాయిలో ఫీజులు రాకపోవడంతో ఈసారి ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఏటా ఫీజులు పెంచుకునే అవకాశం చేసుకుంటే భవిష్యత్తులో తమ ఆదాయానికి తిరుగు ఉండదని యాజమాన్యాలు భావిస్తూ రాజకీయ పైరవీలకు తెరలేపుతున్నారు.

ఇటీవల మంత్రుల కమిటీ సమావేశమై ఫీజుల పెంపుపై ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫీజులు అమలు చేసేందుకు స్కూల్ స్దాయిలో యాజమాన్యాల ప్రతినిధి చైర్మన్‌గా ఓకమిటీ ఉంటుందని, రాష్ట్ర స్దాయిలో పదవి విరమణ పొందిన న్యాయమూర్తి చైర్మన్ మరో కమిటీ ఉంటుందని పేర్కొనట్లు తెలిసింది. ఈకమిటీలో చైర్మన్‌గా పాఠశాలలు సూచించిన వ్యక్తి, కార్యదర్శిగా స్కూల్ ప్రిన్సిపాల్, సభ్యులుగా ముగ్గురు టీచర్లు, ఐదుగురు విద్యార్ధుల తల్లిదండ్రులు ఉంటారు. ఫీజుల వివరాలను పాఠశాల వైబ్‌సైట్‌లో ఉంచాలని, స్కూల్‌లో విద్యార్ధి సంరక్షకుడు చనిపోతే అతని చదువు పూర్తి అయ్యేవరకు ఎలాంటి ఫీజులు తీసుకోవద్దని సూచనలు చేసినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్ జిల్లాలో 1745 ప్రైవేటు పాఠశాలలుండగా వాటిలో 7.10లక్షల మంది చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికి వచ్చే ఏడాది ఫీజుల భారం తప్పదని జిల్లా విద్యాశాఖ పేర్కొంటుంది. కరోనా ప్రభావంతో ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్ల ఫీజుల పెంపుతో సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చదివిస్తామంటున్నారు. మనబస్తీ, మనబడి కార్యక్రమంతో సర్కార్ బడులకు కొత్తరూపం వస్తుందని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ బడులు విద్యార్థులతో సందడిగా మారునున్నాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News