Friday, April 26, 2024

క్రేజీ కాంబినేషన్‌లో సినిమా

- Advertisement -
- Advertisement -

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం తర్వాత మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న పూరి ఆ తర్వాత వరుసగా చిత్రాలు చేయబోతున్నట్లుగా తెలిసింది. ఇక త్వరలో వెంకటేష్ హీరోగా పూరి సినిమా ఉంటుందని అంటున్నారు. వీరిద్దరి కాంబోలో గతంలోనే ఒక సినిమా రాబోతుందని వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు వీరిద్దరి కాంబో మూవీ గురించి మరోసారి వార్తలు వస్తున్నాయి. గత రెండున్నర నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో పూరి జగన్నాథ్ కథల తయారీలో పడ్డాడట.

ఈ సమయంలోనే ఒక కథను వెంకటేష్‌కు వినిపించగా ఆయన ఓకే అన్నాడని.. ఈ సినిమా చేసేందుకు ఆసక్తి చూపించినట్లుగా తెలిసింది. ప్రస్తుతం ఇద్దరికి ఉన్న కమిట్ మెంట్స్ పూర్తయిన తర్వాత వీరి కాంబోలో మూవీ ఉంటుందని అంటున్నారు. పూరి చెప్పిన ఆసక్తికర పాయింట్ వెంకటేష్‌కు బాగా నచ్చడంతో నారప్ప పూర్తయిన వెంటనే ఈ సినిమాలో నటిస్తానంటూ హామీ ఇచ్చాడట. పూర్తి వివరాలను అతి త్వరలోనే అధికారికంగా ఫిల్మ్‌మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది.

Puri Jagannath and Venkatesh Combo Set Up Soon!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News