Friday, April 26, 2024

ఉదయాన్నే సైకిల్ పై తిరుగుతూ అభివృద్ధి పనులపై ఆరా..

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా పట్టణంలో ఉదయాన్నే సైకిల్ పై పర్యటిస్తూ మున్సిపల్ కార్పోరేషన్ లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని పలు వీధులు తిరిగి స్థానిక నివాసాల ప్రజలతో మాట్లాడారు. మిషన్ భగీరథ, రోడ్లు, వీధి దీపాలు, పైప్ లైన్ పనులు, రోడ్డు విస్తరణ పనులు, కాల్వలు తదితర పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్ వారియర్ తో కలిసి మంత్రి పువ్వాడ.. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ రోడ్, కాస్బా బజార్, పాకబండ బజార్, బోనకల్ రోడ్, చర్చ్ కాంపౌండ్, శ్రీనివాస్ నగర్, ప్రకాష్ నగర్, మార్కెట్ రోడ్, సుందరయ్య నగర్, పంపింగ్ వెల్ రోడ్, గాంధీ చౌక్, ట్రంక్ రోడ్, మయూరి సెంటర్, పాత బస్టాండ్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రాడ్, ఆర్ డిఓ కార్యాలయం, వైరా రోడ్, జడ్పీ సెంటర్, కాలెక్టరేట్, ఇల్లందు సర్కిల్, ఐటి హబ్ సెంటర్, వైరా రోడ్, మమత సర్కిల్, వరదయ్య నగర్, లకారం సర్కిల్ ప్రాంతాల్లో పర్యటించారు.

అనంతరం లకారం ట్యాంక్ బండ్ వద్ద మొక్కలు నాటారు. కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అన్ని పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లేని పక్షంలో తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి హెచ్చరించారు.

Puvvada Ajay kumar morning Cycle visit in Khammam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News