Sunday, May 5, 2024

ఈ విజయం మాకు ఎంతో ప్రత్యేకం

- Advertisement -
- Advertisement -

Narasimhapuram movie success meet

తాజాగా విడుదలైన ఫ్యామిలీ ఓరియెంటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘నరసింహపురం’. అయితే ఈ చిత్రం అనూహ్య విజయం సాధిస్తోందని చిత్ర బృందం విజయ సమావేశం ఏర్పాటు చేసింది. హీరో నందకిషోర్ నటన, శ్రీరాజ్ బళ్లా దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని ఫిల్మ్‌మేకర్స్ పేర్కొన్నారు. ఈ వేడుకలో చిత్ర కథానాయకుడు నందకిషోర్, దర్శకుడు శ్రీరాజ్ బళ్లా, నిర్మాత ఫణిరాజ్ గౌడ్, సంగీత దర్శకుడు ఫ్రాంక్లిన్ సుకుమార్, ఛాయాగ్రాహకుడు కర్ణ ప్యారసాని, గీత రచయిత గెడ్డం వీరు, చెల్లెలు పాత్రధారి ఉష, ముఖ్య పాత్రధారులు కళ్యాణ మాధవి, సంపత్ కుమార్, సాయి రాజ్, కో డైరెక్టర్ నాజర్ హుస్సేన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ‘నరసింహపురం‘ చిత్రాన్ని గుండెలకు హత్తుకుంటున్న ప్రేక్షకులకు హీరో నందకిషోర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం తనకే కాకుండా… ఈ చిత్రంలో నటించిన, ఈ చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. రెండేళ్ల తమ కష్టానికి ప్రతిఫలం దక్కుతుండడం పట్ల దర్శకనిర్మాతలు శ్రీరాజ్ బళ్లా, ఫణిరాజ్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. నిర్మాతగా తనకు మూడు కమర్షియల్ సక్సెస్‌లు ఇచ్చిన శ్రీరాజ్ ‘నరసింహపురం‘తో సూపర్ హిట్ కొట్టడం గర్వంగా ఉందన్నారు తుమ్మలపల్లి. యూనిట్ సభ్యులందరికీ ఆయన అభినందనలు తెలిపారు.

Narasimhapuram movie success meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News