Monday, April 29, 2024

దేశంలో మూడు నెలల్లోనే ‘ 1 ’ని మించిన ‘ఆర్ ’ విలువ

- Advertisement -
- Advertisement -

‘R’ value exceeding ‘1’ within three months in the country

కరోనా వ్యాప్తి వేగానికి ఇది సంకేతం
చెన్నై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ పరిశోధకుల వెల్లడి

న్యూఢిల్లీ : కొవిడ్ విషయంలో భారత దేశ ఎఫెక్టివ్ రీప్రొడక్షన్ నంబర్ (ఆర్) విలువ మొదటిసారి మూడు నెలల్లో 1 (ఒకటి)ని దాటినట్టు చెన్నై లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ పరిశోధకులు వెల్లడించారు. కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాపిస్తోందనడానికి ఇది సంకేతమని తెలిపారు. జనవరి నుంచి పరిశీలించగా నిదానంగా గత కొన్నివారాల నుంచి పెరుగుతోందని, ఏప్రిల్ 5 నుంచి 11 లోగా ఆర్ విలువ 0.93 వరకు ఉండగా, ఏప్రిల్ 12 నుంచి 18 లో 1.07 వరకు ఆర్ విలువ పెరిగిందని, మ్యాథమెటీషియన్ సిటబ్ర సిన్హా చెప్పారు. కొవిడ్ మహమ్మారి ప్రారంభం నుంచి భారత దేశ ఆర్ విలువను సిన్హా పరిశీలిస్తున్నారు. ఈమేరకు ఆయన పిటిఐ వార్తా సంస్థకు ఇ మెయిల్ ద్వారా ఇంటర్వూ ఇచ్చారు. జనవరి 16 22 మధ్యకాలంలో ఇది 1.28 గా ఉండేదన్నారు. ఈ విలువ పెరగడానికి కేవలం ఢిల్లీ ఒక్కటే కారణం కాదని, హర్యానా, ఉత్తరప్రదేశ్ కూడా కారణమని పేర్కొన్నారు. ఆర్ విలువ 1 కన్నా ఎక్కువగా ఉంటే కొవిడ్ యాక్టివ్ (క్రియాశీల) కేసులు పెరిగినట్టు అర్థం చేసుకోవాలని, దీన్ని కట్టడి చేయాలంటే ఆర్ విలువ 1 కన్నా తక్కువ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 1 కన్నా తక్కువగా ఆర్ విలువ ఉంటే కరోనా వ్యాప్తి ఆగినట్టు, ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే వారు తగినంతగా లేరని అర్థం చేసుకోవాలన్నారు.

జనవరి 1 10 మధ్య కాలంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభించడంతో ఆర్ విలువ 2.98గా ఉండేదని, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ ఆర్ విలువ 1 కన్నా ఎక్కువగా ఉన్నట్టు సిన్హా చెప్పారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో దీని విలువ 2 కు పైమాటేనని తెలిపారు. కోల్‌కతాకు సంబంధించిన వివరాలు ఇంకా అందుబాటులో లేవని చెప్పారు. ఏప్రిల్ 18 నాటి వారాంతానికి ఢిల్లీలో ఆర్ విలువ 2.12, ఉత్తరప్రదేశ్‌లో 2.12, కర్ణాటకలో 1.04, హర్యానాలో 1.70, ముంబైలో 1.13, చెన్నైలో 1.18,బెంగళూరులో 1.04గా ఆర్ విలువ ఉందని వివరించారు. పెద్ద రాష్ట్రాలు కేరళ, మహారాష్ట్రల్లో 1 కన్నా తక్కువగా అంటే క్రమంగా 0.72,…0.88వంతను ఆర్ విలువ ఉన్నట్టు పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో ఆర్ విలువ 1.08గా ఉందని అంచనా వేస్తున్నామని, అదే గత ఏడాది ఫిబ్రవరి 14 మార్చి 11 మధ్య కాలంలో కూడా ఇదే విధంగా ఆర్ విలువ ఉందని, అయితే రెండో వేవ్ ప్రారంభానికి ముందు గత ఏడాది మార్చి 9 ఏప్రిల్ 21 మధ్యకాలంలో ఆర్ విలువ 1.37 వరకు పెరిగిందని వివరించారు. గత ఏడాది ఏప్రిల్ 29మే 7 మధ్యకాలంలో క్షీణించేముందు ఆర్ విలువ 1.10 కు చేరుకుందని, చివరికి మే 9 నాటికి 1 కన్నా తక్కువకు బాగా క్షీణించిందని విశ్లేషించారు. ఆర్ విలు వ పెరగడం వల్ల ప్రభావం గురించి మాట్లాడుతూ ఎలాగైనా ఇది సాగుతుందని చెప్పారు. ప్రజలు అనుసరించే విధానాల బట్టి దీని గమనం ఉంటుందని, మాస్కులు ధరించడం, జనం రద్దీ నుంచి దూరంగా ఉండటం తదితర జాగ్రత్తలు తీసుకోకుంటే భారీగా కేసులు పెరుగుతాయని చెప్పారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రం చేసుకోవడం, వేరొకరి ముఖం, కళ్లు తాకకుండా ఉండటం , భౌతిక దూరం పాటించడం, వీలైనంతవరకు అనుసరించాలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News