Tuesday, May 14, 2024

గిరిజనుల్లో వినూత్న విధానాలతో సమూల మార్పులు : మాధవరం

- Advertisement -
- Advertisement -

కేపీహెచ్‌బి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం కూకట్‌పల్లి ఎన్‌కెఎన్ ఆర్‌గార్డెన్స్‌లో గిరిజన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడమే కాకుండా అన్ని కులాలు, మతాల వారికి సమప్రాధాన్యతనిస్తూ అనేక సంక్షేమ పథకాలతో వారికి తోడ్పాటునందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపారని పేర్కొన్నారు. రిజర్వేషన్లు పెంచడం, తండాలను పంచాయితీలుగా మార్చడం, గురుకుల విద్యాలయాల ఏర్పాటు, పోడు భూముల పంపిణీ వంటివినూత్న కార్యక్రమాలతో సమూలమైన మార్పులు తీసుకువచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు.

బడుగు, బలహీన వర్గాల కోసం సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారని, కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బాలాజీనగర్‌డివిజన్‌లోని సేవాలాల్‌నగర్‌లో గత ప్రభుత్వ హయాలంలో లేని మౌలిక సదుపాయాలు నేడు కల్పించామని చెప్పారు. రో డ్లు, డ్రైనేజీ, 24గంటల మంచినీటి సదుపాయం కల్పించి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూసుకుంటున్నామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నేడు తండాలు అన్ని మౌళిక సదుపాయాలతో అభివృద్ధి చెంది గిరిజనులే సర్పంచులను చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గిరిజనుల కోసం బంజారా హిల్స్‌లో బంజారా భవన్‌ను నిర్మించి గిరిజనుల పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పగుడాల శిరీషాబాబూరావు, డిసీ రవికుమార్‌తోపాటు గిరిజన సంక్షేమ శాఖ నోడల్ అధికారులతోపాటు స్థానిక గిరిజన సంక్షేమ నాయకులు శంకర్, కళ్యాణ్ , క్ళాణ్, పెంటయ్య, ఖైలా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News