Monday, April 29, 2024

పాత యమునా నది వంతెనపై రైళ్ల రాకపోకలు బంద్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నదిలో నీటి ప్రవాహం ప్రమాద స్థాయిని మించడంతో మంగళవారం పాత యమునా నది వంతెనపై రైళ్ల రాకపోకాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పాత యమునా నది వంతెనపై మంగళవారం ఉదయం 6 గంటల నుంచి రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు ఉత్తర రైల్వే అధికారులు తెలిపారు. యమునా నదిలో ప్రమాద స్థాయి 205.33 మీటర్లు కాగా ప్రస్తుత నీటి ప్రవాహ స్థాయి 206.24 మీటర్లకు చేరుకుంది. వదర స్థాయి 207.49 మీటర్లని కేంద్ర జల మండలి అధికారులు చెప్పారు.

హర్యానాలో కూడా భారీ వర్షాలు పడుతుండడంతో హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి సోమవారం 15,677 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో యమునా నదిలో నీటి మట్టం బాగా పెరిగిపోయింది. ఉత్తర భారత వ్యాప్తంగా ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానాలో భారీ వర్షాలు జలవిలయాన్ని సృష్టిస్తున్నాయి. అనేక చోట్ల నదులు, వాగులు, వంకలు పొంగిప్రవహిస్తున్నాయి. అనేక చోట్ల కొండచరియలు విరిగి రోడ్డుపై పడడంతో వాహనాల రాకోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News