Tuesday, May 7, 2024

తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్ష సూచన

- Advertisement -
- Advertisement -

Rain forecast for Telangana for three days

హైదరాబాద్: రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఎపి తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తున మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపునకు వంపు తిరిగి ఉందని వెల్లడించింది. ఉత్తర ఇంటిరియల్ ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది.

Rain forecast for Telangana for three days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News