Friday, April 26, 2024

నేడు, రేపు పలుచోట్ల వర్షాలు

- Advertisement -
- Advertisement -

Rains at several places across telangana

హైదరాబాద్: నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ ఛత్తీస్‌ఘడ్ వరకు 5.8 కి.మీల ఎత్తు వద్ద ఉత్తర దక్షిణ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం గంటపాటు కురిసిన వర్షానికి నగరం తడిసిముద్దయ్యింది.

Rains at several places across telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News