Tuesday, April 30, 2024

రజనీకాంత్‌కు అస్వస్థత

- Advertisement -
- Advertisement -
Rajinikanth admitted to Kauvery Hospital
చెన్నై ఆసుపత్రిలో చేరిక

చెన్నై : అగ్రనటుడు రజనీకాంత్ గురువారం ఇక్కడి కావేరీ ఆసుపత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షలలో భాగంగానే రజనీకాంత్ ఆసుపత్రిలో చేరినట్లు ఆయన వ్యక్తిగత బృందం తెలిపింది. ఇటీవలి కాలంలో రజనీకాంత్ ఒకటి రెండు సినిమాల చిత్రీకరణలలో ఉన్నారు. రాజకీయాల ప్రవేశ ప్రసక్తిని పక్కకు పెట్టారు. క్రమం తప్పకుండా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారని ఈ క్రమంలోనే ఆయనకు వైద్యపరీక్షలను ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారని సహాయకులు తెలిపారు. రజనీ కాంత్ ఇటీవలే ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకుని వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీని ఇతర ప్రముఖులను కూడా అక్కడ కలిశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News