Tuesday, April 30, 2024

రజనీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్ నిలిపివేత..

- Advertisement -
- Advertisement -

కరోనా కారణంగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’ షూటింగ్ నిలిపివేశారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీఫిలీమ్ సిటీలో జరుగుతోంది. అయితే, ఈ మూవీ చిత్రీకరణ సమయంలో కరోనా క‌ల‌క‌లం సృష్టించింది. సినిమా సిబ్బందిలో 6మందికి కరోనా పాజిటీవ్ నిర్దారణ అయ్యింది. దీంతో చిత్రయూనిట్ షూటింగ్ నిలిపివేసింది. క‌రోనా ప‌రీక్ష‌ల్లో ర‌జ‌నీకాంత్ కు మాత్రం నెగెటివ్ వచ్చింది. ప్రస్తుతం ర‌జ‌నీకాంత్ హోం ఐసోలేష‌న్ లో ఉన్నారు. శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో న‌య‌న‌తార‌, కీర్తిసురేశ్, ప్ర‌కాశ్ రాజ్‌, ఖుష్బూ, మీనా కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Rajinikanth’s ‘Annaatthe’ shooting stopped due to Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News