Thursday, November 7, 2024

అత్యాచారం …. వాట్సాప్ లో వీడియో… అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Rape accused arrest in jadcherla

జడ్చర్ల: నీళ్లలో మత్తుమందు కలిసి ఓ అమ్మాయి అత్యాచారం చేసిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో జరిగింది. వీడియోను ఫోన్లలో షేర్ చేయడంతో నిందితులను పోలీసుఉ అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జడ్చర్లకు చెందిన అమ్మాయి(17) బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండడంతో హైదరాబాద్‌కు వచ్చింది. ఈ ఫంక్షన్‌లో అమ్మాయికి సబీల్(21) అనే యువకుడు పరిచయమయ్యాడు. బాలికకు పలుమార్లు ఫోన్ చేసి మాట్లాడాడు. అతడి మాయమాటలకు బాలిక పడిపోవడంతో ఒక రోజు ఫోన్ చేసి జడ్చర్ల బస్టాండ్ రావాలని కోరాడు. అనంతరం ఆమెను లాడ్జికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసి వీడియోను చిత్రీకరించాడు. ఈ వీడియోలను తన బంధువుల ఫోన్లకు పంపించాడు. సబీల్ స్నేహితులు తాలిబ్(19), అల్తాప్(20) వీడియోలను అడ్డపెట్టుకొని ఆమెను వేధించడం మొదలు పెట్టారు. బాలిక కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్‌కు ఆ వీడియో రావడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆమె తండ్రి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశామని జడ్చర్ల సిఐ వీర స్వామి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News