Wednesday, May 8, 2024

సంధ్య కన్వెన్షన్ ఎండిపై అత్యాచారం కేసు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంధ్య కన్వెన్షన్ ఎండి శ్రీధర్‌రావుపై రోజుకో ఆరోపణలు వస్తున్నాయి. బాధితులు ఒక్కరొక్కరుగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా శ్రీధర్‌రావు వద్ద బాడీగార్డుగా పనిచేసిన ఆర్య చౌదరి తనను రేప్ చేశాడని సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మేల్ బాడీగార్డుపై అత్యాచారం చేసిన తర్వాత ఈ విషయం ఎవరికీ చెప్పొదంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని చెప్పాడు. శ్రీధర్ రావు వద్ద బాడీగార్డుగా చేరక ముందు ఆర్య చౌదరి జిమ్ ట్రైనర్‌గా ఉన్నాడు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి శ్రీధర్ రావు వద్ద బాడీగార్డుగా పనిచేస్తున్నాడు. తనపై అత్యాచారం చేసిన శ్రీధర్ రావుపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. ఫిర్యాదుపై స్పందించిన సనత్‌నగర్ పోలీసులు శ్రీధర్ రావుపై ఐపిసి 377,341,323,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Rape case against Sandhya Convention MD Sreedhar Rao

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News