Wednesday, May 1, 2024

రాజు ఆత్మహత్యలో అనుమానాలకు తావు లేదు

- Advertisement -
- Advertisement -
rapist Raju committed suicide and no doubts in it
రైలు డ్రైవర్లు, రైతులు, రైల్వే కార్మికులు ప్రత్యక్షంగా చూశారు
ఆత్మహత్య కేసులో ఏడుగురు ప్రత్యక్ష సాక్షులున్నారు
సాక్షులు వెల్లడించిన విషయాలు వీడియో గ్రఫీ చేశాం
డిజిపి మహేందర్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : సైదాబాద్ సింగరేణి కాలనీకి చెంది న చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడు రాజు ఆత్మహత్య కేసులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని డిజిపి మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈక్రమంలో గురువారం ఉదయం 8.05 నిమిషాలకు కొనార్క్ ఎక్స్ ప్రెస్ కింద పడి రాజు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ట్రైన్‌ను డ్రైవ్ చేస్తున్న డ్రైవర్స్ ప్రత్యక్షంగా చూసి ఫిర్యాదు చేసినట్లు డిజిపి తెలిపారు. రాజు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అక్కడ ఉన్న కొంత మంది రైతులు కళ్లారా చూశారన్నా రు. గురువారం ఉదయం విధులకు వెళుతున్న వారు కూడా రాజును గుర్తు పట్టి ప్రశ్నిస్తుండగా అక్కడ నుండి పారిపోయాడని తెలిపారు. రాజు ఆత్మహత్య కేసులో 7 మంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని, వారి చెప్పిన విషయాలు అన్ని కూడా వీడియో గ్రఫీ చేసినట్లు డిజిపి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ క్రమంలో రాజు ఘట్‌కేసర్-, వరంగల్ మధ్య స్టేషన్ ఘన్‌పూర్ మండలం పామునూరు దగ్గర రాజారాం వంతెన వద్దకు ఎలా చేరుకున్నాడన్న విషయాలపై దర్యాప్తు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా సిసి కెమెరాలు పరిలీస్తున్నామని, రాజు ట్రాక్‌పై నడుచుకుంటు వెళుతుండగా రైల్వే సిబ్బంది చూసి పట్టుకోడానికి ప్రయత్నించినా సాధ్యంకాలేదని, ట్రైన్ కింద పడి నిందితుడు రాజు చనిపోయాడన్నారు. హత్యాచార నిందితుడు రాజు మృతదేహాన్ని గురువారం ఉదయం 8:45 గంటల సమంలో రైల్వే కార్మికులు గుర్తించి రైల్వే ఉన్నతాధికారులకు కార్మికులు సమాచారం ఇచ్చారని, అలాగే రైల్వే ఉన్నతాధికారులు డయల్ 100 ద్వారా వరంగల్ సిపికి సమాచారం అందించారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News