Monday, May 6, 2024

విమానంలో హస్తప్రయోగం…. ర్యాపర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: టోక్యో నుంచి మిన్నీపోలిస్ వెళుతున్న విమానంలో అసభ్యంగా ప్రవర్తించినందుకు డిజైనర్ అనే ర్యాపర్‌ను అమెరికన్ పోలీసులు అరెస్టు చేశారు. విమానంలో హస్తప్రయోగానికి పాల్పడినట్లు డిజైనర్‌పై అభియోగాలు నమోదయ్యాయి. ఈ అభియోగాలు రుజువైతే అతనికి 90 రోజులకు పైగా కారాగార శిక్ష, 500 డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. డిజైనర్ అసలుపేరు సిడ్నీ రాయల్ సెల్బీ 3.

Also Read: సిరివెన్నెల జీవితాన్ని మలుపు తిప్పిన పాట ఏమిటో తెలుసా?

ఏప్రిల్ 17న టోక్యో నుంచి మిన్నీపోలిస్ వస్తున్న విమానంలో ప్రయాణిస్తున్న ర్యాపర్ డిజైనర్ హస్తప్రయోగం చేస్తూ విమాన సిబ్బంది కంటపడ్డాడు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే రీతిలో అతని ప్రవర్తన ఉన్నట్లు గుర్తించిన విమాన సిబ్బంది అతడిని విమానం దిగిన వెంటనే భద్రతా సిబ్బందికి అప్పగించారు. తన ప్రవర్తనకు డిజైనర్ విమాన సిబ్బందికి క్షమాపణ చెప్పినప్పటికీ అతడిపై కేసు నమోదైంది.

అనంతరం..డిజైనర్ ఒక ట్వీట్ పోస్ట్ చేస్తూ విమానంలో తన ప్రవర్తనకు సిగ్గుపడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. తన మానసిక పరిస్థితి సరిగా లేదని, అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని మానసిక చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాలని అనుకుంటున్నట్లు అతను తెలిపాడు. అయితే..ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌బిఐ ప్రశ్నించినపుడు జపాన్‌లో తనకు ఎవరూ నచ్చలేదని, కాని విమానంలోని అటెండెంట్లలో ఒక మహిళ ఆకర్షణీయంగా కనిపించిందని డిజైనర్ చెప్పినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News