Friday, May 3, 2024

నానీకి జోడీగా రష్మిక?

- Advertisement -
- Advertisement -

Rashmika mandanna will act with Nani

 

టాలీవుడ్‌లో సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి భారీ హిట్లు కొట్టేసిన రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన నాయికగా ’పుష్ప’ సినిమా చేస్తోంది. ఈ సినిమాలో ఆమె గ్రామీణ యువతి పాత్రను పోషిస్తోంది. ఈ పాత్ర తనకి చాలా సంతృప్తిని కలిగించిందనీ, ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతుందని రష్మిక తాజాగా పేర్కొంది. ఈ సినిమా తరువాత రష్మిక వేరే ప్రాజెక్టులపైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే నానికి జోడీగా ఆమె కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఇటీవల ’వకీల్ సాబ్’ సినిమాతో హిట్ కొట్టిన వేణు శ్రీరామ్ .. తదుపరి సినిమాను లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు. ఇప్పటికే కథను రెడీ చేసుకున్న ఆయన పెద్ద బ్యానర్లతో సంప్రదింపులు జరుపుతున్నాడని అంటున్నారు.

నానీని దృష్టిలో పెట్టుకునే ఆయన ఓ కథను సిద్ధం చేసుకున్నాడని చెబుతున్నారు. ఇంతకు ముందు నాని, – వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ’మిడిల్ క్లాస్ అబ్బాయ్’ సినిమా విజయాన్ని సాధించింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన నానీని దృష్టిలో పెట్టుకునే కథను సిద్ధం చేసుకున్నాడని తెలిసింది. ఈ కథలో నాయిక పాత్రకి రష్మిక అయితే బాగుంటుందని ఆయన అనుకుంటున్నాడట. గతంలో ‘దేవదేసు’లో నాని, – రష్మిక కలిసి సందడి చేశారు. మళ్లీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు కోసం వాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలో ఈ సినిమా గురించి పూర్తి క్లారిటీ రానుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News