మేషం – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. చేపట్టిన పనులు సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. సోదరుల నుండి ధనలాభం.
వృషభం – కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. వివాదాలకు దూరంగా వుండండి. ప్రయాణాలు లాభిస్తాయి. శుభవార్తలు వింటారు.
మిథునం – ఆర్థిక పరిస్థితి ఓ మోస్తరుగా వుంటుంది. దేవాలయాలను సందర్శిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వస్తు లాభం.
కర్కాటకం – ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. అనుకోని అవకాశాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.
సింహం – రుణ వత్తిడుల నుండి బయటపడతారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకంటారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. వివాహా సంబంధ విషయ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.
కన్య – వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. పుణ్య క్షేత్రాల సందర్షన మీకు మేలు కలిగిస్తుంది.
తుల – ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా వుంటాయి. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
వృశ్చికం – కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు.
ధనుస్సు – ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది . నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. ఇంటాబయటా మీదే పై చేయిగా వుంటుంది.
మకరం – రుణాలు తీరుస్తారు. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. సంఘంలో గౌరవం పొందుతారు.
కుంభం – నూతన ఉద్యోగవకాశాలు పొందుతారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొంటారు. ధనలాభం.
మీనం – కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహన సౌఖ్యం. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శుభవార్తలు.