Saturday, May 4, 2024

ఐదుగురు విలన్లతో పోరాటం

- Advertisement -
- Advertisement -

Ravi Teja Fights With Five Villains in Khiladi

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖిలాడి’. ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియోస్ జయంతి లాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రవితేజ డ్యూయల్ రోల్‌లో కనిపిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌధరి, – డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. ఇటీవలే కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు.

‘ఖిలాడి’ చిత్రం కోసం నలుగురు ఫైట్ మాస్టర్స్ రామ్,-లక్ష్మణ్, అన్బు, -అరివు వర్క్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మొత్తం ఐదుగురు విలన్లు ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే ఇద్దరు ప్రముఖ బాలీవుడ్ విలన్స్‌ని రంగంలోకి దింపారట. కొత్తగా అనూప్ సింగ్‌ని కూడా ప్రతినాయకుడిగా తీసుకున్నారట. సూర్య ‘సింగం 3’,- అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాల్లో విలన్‌గా నటించిన అనూప్ సింగ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు రవితేజతో ఫైట్ చేయడానికి అతను సిద్ధమమయ్యాడని తెలిసింది. ఇకపోతే ‘ఖిలాడి’ సినిమాను మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Ravi Teja Fights With Five Villains in Khiladi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News