Friday, May 3, 2024

రవితేజ నయా మూవీ షురూ

- Advertisement -
- Advertisement -

Ravi Teja New Movie Launch

ఉగాది సందర్భంగా కొత్త దర్శకుడితో కొత్త సినిమాను ప్రారంభించాడు హీరో రవితేజ. రచయిత శరత్ మండవ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్, ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ నటిస్తోంది. ఈ సినిమా యదార్థ సంఘటలన ఆధారంగా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ చివరిలోపే ప్రారంభం అవుతుందని మేకర్స్ చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః సత్యన్ సూర్యన్, సంగీతంః స్యామ్ సిఎస్, ఆర్ట్‌ః సాయి సురేష్.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News