Saturday, April 27, 2024

“ధమాకా” నుంచి డు డు సాంగ్

- Advertisement -
- Advertisement -

 

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ధమాకా నుండి విడుదలైన డు డు సాంగ్ ప్రోమో పాటపై అంచనాలు పెంచింది. ఈ రోజు పూర్తి పాట విడుదలైయింది. భీమ్స్ సిసిరోలియో ఈ పాటని మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే ఎక్స్ టార్డినరీ మాస్ నెంబర్ గా కంపోజ్ చేశారు.

ఈ పాటలో రవితేజ స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్, స్వాగ్ మైండ్ బ్లోయింగా వున్నాయి. రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ రోల్ ని తెలియజేస్తోంది. ఈ పాటని పృధ్వీ చంద్ర ఫెంటాస్టిక్ గా ఆలపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News