Saturday, April 27, 2024

తెలంగాణకు గుర్తింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం ఏర్పాటు

మన తెలంగాణ/హైదరాబాద్:వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ లో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. సిఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోనే బృందానికి తొలి రోజే మంచి స్పందన లభించింది. ప్రపంచ ఆర్థిక సదస్సు ఆధ్వర్యం లో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (సి4ఐఆర్)కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు ఒ ప్పందం కుదిరింది. బయో ఏషియా -2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ సెంటర్ ప్రారంభం కానుం ది.తద్వారా సిఎంరేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే (స్టేట్ హెల్త్ టెక్ ల్యాండ్ స్కేప్) సాంకేతిక ఆధారిత కార్యక్రమం రూపుదిద్దుకోనుంది. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో వరల్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సు లో వరల్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే ప్రతినిధి బృందంతో సిఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది.

అనంతరం సి4ఐఆర్ హైదరాబాద్ లో ప్రారంభించడంపై సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో టెక్నాలజీ కలయిక తో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తెలంగాణకు వి శిష్ట సహకారం అందించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విశాల దృక్పథం, నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయని, అందుకే రెండిం టి మధ్య అద్భుతమైన సమన్వయం కుదిరిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జీవన విధానాలు, జీవ న నాణ్యత ప్రమాణాలు మెరుగుపరిస్తే ప్రజల జీవితాలు బాగుపడుతాయనే ఆలోచనల సారూప్యతకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రపంచ స్థాయిలో పని చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజల పై దృష్టి కేంద్రీకరిస్తోందన్నారు. ఇరువురి భాగస్వామ్యంతో ప్రజల ఆరోగ్యం, సాంకేతికత, మంచి జీవితం అందించాలనే లక్ష్యాలను వేగంగా అందుకోవచ్చని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

ప్రపంచ స్థాయిలో ఆరోగ్య సంరక్షణ విధానాలను సరికొత్తగా పునర్నిర్వించే ఆలోచనలుఉన్నాయని.. చిన్న పట్టణాలు, గ్రామాలకు ఈ సేవలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ హెల్త్ టెక్ హబ్‌గా తెలంగాణను ప్రపంచ గమ్యస్థానంగా మార్చటంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ సేవలను అందించే సంకల్పంతో పని చేస్తుందని పేర్కొన్నారు.హెల్త్ టెక్, లైఫ్ సైన్సెస్ భవిష్యత్తుకు నాయకత్వం వహించేందుకు సరిపడేన్ని అవకాశాలెన్నో భారతదేశానికి ఉన్నాయని, అందులో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని వరల్ ఎకనమిక్ ఫోరమ్ సెంటర్ ఫర్ హెల్త్ అండ్ హెల్త్‌కేర్ హెడ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ డాక్టర్ శ్యామ్ బిషెన్ అన్నారు. ప్రపంచంలోనే మొదటి ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా సి4ఐఆర్ ఏర్పాటుతో తెలంగాణ మరింత కీలకంగా మారనుందన్నారు. ప్రభుత్వ రంగంతో పాటు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ మధ్య సమన్వయ సహకారం కుదర్చటంతో పాటు ఆరోగ్య సంరక్షణ (హెల్త్ కేర్) విభాగంలో ఉద్యోగాల కల్పనకు మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ఫోరమ్ అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న డిజిటల్ హెల్త్‌కేర్ ట్రాన్స్ఫర్మేషన్ ల క్ష్యం నెరవేరుతుందనే విశ్వాసముంచారు. దీంతో రోగులకు మెరుగైన సేవలు అందించడం, అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణలో సాంకేతిక విధానాలకు చొరవ చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఈ కేంద్రం ప్రారంభమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వరల్ ఎకనమిక్ ఫోరమ్ ప్రభావాన్ని మరింత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలను అందజేస్తుందని అని డాక్టర్ శ్యామ్ బిషెన్ హర్షం వ్యక్తం చేశా రు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సి4ఐఆర్ నెట్‌వర్క్ అయిదు ఖండాలలో విస్తరించింది. సి4ఐఆర్ తెలంగాణ సెం టర్.. ప్రపంచంలో 19వది. హెల్త్‌కేర్ మరియు లైఫ్ సైన్సెస్ నేపథ్యంతో ఉన్నమొదటి కేంద్రం హైదరాబాద్‌లోనే ప్రారంభమవనుంది. ఆసియాలోనే తెలంగాణ ప్రముఖ లైఫ్ సైన్సెస్ హాట్‌స్పాట్ గా పరిగణిస్తారు. దీనికి స్వయం ప్రతిపత్తి ఉం టుంది. ఇది లాభాపేక్ష లేని సంస్థ. ఆరోగ్య సంరక్షణ మరియు లైఫ్ సైన్సెస్ కోసం పాలసీ మరియు పాలనపై నాయకత్వం వహిస్తుంది. తెలంగాణ ప్ర భుత్వం రాష్ట్రంలోని ఇంక్యుబేటర్ల ద్వారా రా బోయే 5 సంవత్సరాలలో 20,000 స్టార్టప్‌లపై ప్ర భావం చూపాలని లక్ష్యంగా పెట్టుకుంది.
హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సెంటర్ ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. ప్రపంచ ఆర్థిక సదస్సు ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (సి4ఐఆర్) హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు ఒప్పందం చేసుకున్నారు. బయో ఏషియా -2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ సెంటర్ ప్రారంభం కానుంది. దీంతో రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే (స్టేట్ హెల్త్ టెక్ ల్యాండ్ స్కేప్) సాంకేతిక ఆధారిత కార్యక్రమం రూపుదిద్దుకోనుంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో వరల్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే ప్రతినిధి బృందంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీమ్ చర్చలు జరిపింది. అనంతరం సి4ఐఆర్ హైదరాబాద్‌లో ప్రారంభించడం పై సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో టెక్నాలజీ కలయికతో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వర ల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తెలంగాణకు విశిష్ట సహకారం అందించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విశాల దృక్పథం, నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయని, అందుకే రెండింటి మధ్య అద్భుతమైన సమన్వయం కుదిరిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నా రు. జీవన విధానాలు, జీవన నాణ్యత ప్రమాణాలు మెరుగుపరిస్తే ప్రజల జీవితాలు బాగుపడుతాయనే ఆలోచనల సారూప్యతకు కట్టుబడి ఉన్నట్లు చెప్పా రు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రపంచ స్థాయిలో పని చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలపై దృష్టి కేంద్రీకరిస్తోందన్నారు. ఇరువురి భాగస్వామ్యంతో ప్రజల ఆరో గ్యం, సాంకేతికత, మంచి జీవితం అందించాలనే లక్ష్యాలను వేగంగా అందుకోవచ్చని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రపంచ స్థాయిలో ఆరోగ్య సంరక్షణ విధానాలను సరికొత్తగా పునర్నిర్వించే ఆలోచనలు ఉన్నాయని.. చిన్న పట్టణాలు, గ్రామాలకు ఈ సేవలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీ ధర్‌బాబు మాట్లాడుతూ హెల్త్ టెక్ హబ్‌గా తెలంగాణను ప్రపంచ గమ్యస్థానంగా మార్చటంపై ప్ర భుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ సేవలను అందించే సంకల్పంతో పని చేస్తుందని పేర్కొన్నారు.హెల్త్ టెక్, లైఫ్ సైన్సెస్ భవిష్యత్తుకు నాయకత్వం వహించేందుకు సరిపడేన్ని అవకాశాలెన్నో భారతదేశానికి ఉన్నాయని, అందులో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని వరల్ ఎకనమిక్ ఫోరమ్ సెంటర్ ఫర్ హెల్త్ అండ్ హెల్త్‌కేర్ హెడ్, ఎగ్జిక్యూటివ్ కమి టీ మెంబర్ డాక్టర్ శ్యామ్ బిషెన్ అన్నారు. ప్రపంచంలోనే మొదటి ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా సి4ఐఆర్ ఏర్పాటుతో తెలంగాణ మరింత కీలకం గా మారనుందన్నారు. ప్రభుత్వ రంగంతో పాటు స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ మధ్య సమన్వయ సహకారం కుదర్చటంతోపాటు ఆరోగ్య సంరక్షణ (హెల్త్ కేర్) విభాగంలో ఉద్యోగాల కల్పనకు మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ఫోరమ్ అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న డిజిటల్ హెల్త్‌కేర్ ట్రాన్స్‌ఫర్మేషన్ లక్ష్యం నెరవేరుతుందనే విశ్వాసముంచారు. దీంతో రోగులకు మెరుగైన సేవలు అందించడం, అందరికీ అందుబాటులో ఉండే ఆ రోగ్య సంరక్షణలో సాంకేతిక విధానాలకు చొరవ చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఈ కేంద్రం ప్రారంభమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వరల్ ఎకనమిక్ ఫోరమ్ ప్రభావాన్ని మరింత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలను అందజేస్తుందని అని డాక్టర్ శ్యామ్ బిషెన్ హర్షం వ్యక్తం చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సి4ఐఆర్ నెట్‌వర్క్ అయిదు ఖండాలలో విస్తరించింది. సి4ఐఆర్ తెలంగాణ సెంటర్.. ప్రపంచంలో 19వది.
పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు
సోమవారం దావోస్ చేరుకున్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేం దు కు ప్రయత్నాలు ప్రారంభించారు. సిఎం రేవంత్ రెడ్డితోపాటు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కూడా ఈ టూర్‌లో ఉన్నారు. అధికారులు కూడా పర్యటనలో భాగమయ్యారు. అంతా కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. దావోస్ చేరుకున్న వెంటనే రేవంత్ టీం ఇథియోఫియా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెమె క్ హసెంటోతో సమావేశమైంది. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్ మ్యాప్ ఆయనతో చర్చించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫ్రెసిడెంట్ బోర్గోబ్రెండే, ఇతర ప్రముఖులతో కూడా భేటీ అయ్యారు. తెలంగాణ ఏర్పడిన కొత్త ప్రభుత్వ ఆలోచనలు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం సృష్టించడంలో చేపట్టబోయే కార్యక్రమాలు వివరించారు. సిఎం రే వంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు తెలంగాణ ప్రతినిధి బృందం నేషనల్ అసోషియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కాం) ప్రెసిడెంట్ శ్రీమతి దేబ్జానీ ఘోష్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో స్కిల్ డెవెలప్‌మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించటం, అందుకోసం అనుసరించే భవిష్యత్తు మార్గాలపై చర్చించారు. ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులు చదువుతున్న యువతకు స్కిల్ డెవెలప్ మెంట్, ప్లేస్‌మెంట్ కమిట్మెంట్, విలువైన ఉద్యోగాల కల్పనకు సాయం అందించే అంశాలపై సం ప్రదింపులు జరిపారు. స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ విమానాశ్రయంలోనే ప్రవాసీ తెలంగాణ ప్రముఖులతో రేవంత్ టీం చర్చలు జరిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News