Wednesday, May 15, 2024

వితంతువుపై మాజీ ఎస్ఐ అత్యాచారం…. ఆపై పెళ్లి చేసుకుంటానని

- Advertisement -
- Advertisement -

 

ఛండీగఢ్: పెళ్లి చేసుకుంటానని ఓ వితంతువుపై ఓ మాజీ ఎస్ఐ పలుమార్లు అత్యాచారం చేసినట్టుగా కేసు నమోదు చేసిన సంఘటన హర్యానాలో సిర్సా మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సదరు పోలీస్ 2018లో ఓధాన్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా పని చేశాడు. ఓ కేసు విషయంలో వితంతువుతో(45) ఎస్ఐకి పరిచయం ఏర్పడింది. కేసు విషయంలో ఆమె పలుమార్లు పోలీస్ స్టేషన్ కు రావడంతో ఆమెపై అత్యాచారం చేసి  అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఒక వేళ తనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే చంపేస్తానని లేకపోతే పెళ్లి చేసుకుంటానని ఆమెకు ఆశ చూపాడు. అంతే కాకుండా సదరు మహిళకు భర్త లేకపోవడంతో పిల్లలకు సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు. సదరు ఎస్ఐ ఆమెను పెళ్లి చేసుకోకపోవడంతో సిర్సా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మహిళ పోలీస్ అధికారి సునీత దేవి సదరు ఎస్ఐపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని తెలిపింది. సదరు ఎస్ఐకి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుందని వెల్లడించింది.

 

Retired SI Rape on Widow with Marriage in Haryana 

 

Retired SI Rape on Widow with Marriage in Haryana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News