Monday, April 29, 2024

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్ప తనను మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కొండాపూర్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఎనమిదవ బెటాలియన్ కు చెందిన పల్ల గురవయ్య(30)ను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. వివరాల్లోలకి వెళితే.. మహబూబాద్ జిల్లా, చిన్న ముప్పారంకు చెందిన పల్ల గురవయ్య కామన్ ఫ్రెండ్ ద్వారా మలక్ పేట్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో నర్సింగ్ చేస్తున్న ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆపై ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. దాదాపు రెండు సంవత్సరాల పాటు జరిగిన వీరి ప్రేమ వ్యవహారంలో ఆమెతో పలుమార్లు సన్నిహితంగా మెలిగి, వేరే పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న సదరు యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు.

Panjagutta Police arrested a Constable for cheating woman

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News