Saturday, April 27, 2024

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు అప్రతిష్ఠ

- Advertisement -
- Advertisement -

ఒకప్పుడు స్టేషన్‌కు బెస్ట్ అవార్డు.. ఇప్పుడు ఆరోపణలకు కేరాఫ్, పలు అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు, సిపి తాజానిర్ణయంతో సంచలనంగా మారిన పంజాగుట్ట స్టేషన్

మన తెలంగాణ/పంజాగుట్ట: ఆకాశానికి ఎగసి ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది మన గ్రేట్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ప్రతిష్ట. గ్రేటర్ హైదరాబాద్‌లోనే అత్యంత కీలకమైన ఏ గ్రేడ్‌లో ఉన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సీపీ నిర్ణయం కారణంగా ఇప్పుడు సంచలన వార్తల్లోకి ఎక్కింది. ఒకప్పుడు దేశంలోనే ఉత్తమ స్టేషన్‌గా పేరొందిన పంజాగుట్ట ఇప్పుడు పలు ఆరోపణలకు కేరాఫ్‌గా మారి తక్కువ కాలంలోనే ప్రతిష్టను కోల్పోయింది. ఏకకాలంలో 85 మందిని ఇక్కడి నుంచి బదిలీ చేసిన సిపి కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి పోలీస్ శాఖలో అవినీతిని సహించేది లేదని మొత్తం శాఖకే తీవ్రమైన హెచ్చరికలు పంపించారు.

నగరం నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వీఐపీ జోన్‌లో ఉందని చెప్పొచ్చు. ఇక్కడ సీఎం క్యాంపు కార్యాలయం మొదలు ఎన్నో కీలకమైన ఆఫీసులు, అధికారుల కార్యాలయాలు, పెద్దపెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఈ ఠాణాలో పని చే సేందుకు పోలీస్ శాఖలోని ప్రతి అధికారి ఉవ్విళ్లూరుతారు. ఇన్‌స్పెక్టర్ పోస్టు కోసం ఏకంగా మంత్రు ల స్థాయిలో పైరవీలు చేయించుకుంటారనే టాక్ ఉంది. కాగా 2018లో ఈ పోలీసుస్టేషన్‌కు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్ల నిర్వహణ, పనితీరు తదితరాలను బేరీజు వేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బెస్ట్ ఠాణా అవార్డులు ఇవ్వడాన్ని ఆ ఏడాది నుంచే ప్రారంభించింది. ఆ ఏడా ది ఈ పోలీసుస్టేషన్ దేశంలోనే రెండో బెస్ట్ ఠాణా గా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలోనే నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్న ఐపీఎస్‌లతో పాటు ఇక్కడ పర్యటనకు వచ్చిన వివిధ రాష్ట్రాల, దే శాల మంత్రులు, అధికారులకు ఈ మోడల్ ఠాణా చూపించేవారు.

ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా..
కొందరు అధికారుల వ్యవహారశైలి, సిబ్బంది పనితీరు, పలు అధికారుల అవినీతి కారణంగా బెస్ట్ ఠాణా కాస్త ఇప్పుడు వివాదాలకు కేంద్రం బిందువు గా మారింది. ఇటీవల కాలంలో వరుసగా చోటు చే సుకున్న వ్యవహారాలు దీని ప్రతిష్టను మసకబారేలా చేశాయి. ముఖ్యంగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ కేసు వ్యవహారం కారణంగానే సీపీ ఇంతగా రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది. ఈ కేసు కారణంగానే మొదట ఇన్‌స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేశారు. ఇదే కాకుండా ఇటీవలి కాలంలో ఈ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసులు వివాదాస్పదంగా మారాయి. మరోవైపు ఇక్కడి అధికారులు, సిబ్బంది కొన్ని ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. మాజీ అధికారులతో సంబంధాలున్న కొందరు వివిధ కేసులకు సంబంధించిన సమాచారానికి వారికి అందించినట్లుగా ఉన్నతాధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే పంజగుట్టపై సీపీ సంచలన నిర్ణయం తసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News