Monday, May 6, 2024

సిధి ప్రమాదంలో ప్రయాణికులను కాపాడిన ముగ్గురికి రివార్డులు

- Advertisement -
- Advertisement -
Rewards for three rescued passengers in Sidhi bus accident
సిధి ప్రమాదంపై సిఎం శివరాజ్ ప్రకటన

భోపాల్: సిద్ధి జిల్లాలో కాల్వలో బస్సు పడిన దుర్ఘటనలో కొందరు ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన ఒక యువతితో సహా ముగ్గురు వ్యక్తులకు రూ. 5 లక్షల చొప్పున రివార్డులను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. 51 మంది ప్రాణాలు కోల్పోయిన బస్సు ప్రమాదం దుర్ఘటన జరిగిన మరుసటి రోజు బుధవారం జిల్లాను సందర్శించిన చౌహాన్ ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆరుగురు ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన స్థానికులు శివరాణి, లవకుశ్ లూనియా, మరో అధికారి సత్యేంద్ర శర్మకు రూ. 5 లక్షల చొప్పున రివార్డులను ప్రకటించారు. సిధికి 80 కిలోమీటర్ల దూరంలోని పట్నా గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం ఈ బస్సు ప్రమాదం జరిగింది.

ఇదిలా ఉండగా బస్సు ప్రమాదం వల్ల కాల్వలో కొట్టుకుపోయిన ముగ్గురు వ్యక్తుల ఆచూకీ కోసం సైన్యం సహాయాన్ని కోరినట్లు సిధి జిల్లా కలెక్టర్ రవీంద్ర కుమార్ చౌదరి తెలిపారు. ఈ ప్రమాదంలో గల్లంతైన ముగ్గురు వ్యక్తుల ఆచూకీ రెండు రోజులైనా లభించలేదని, ఈ కాల్వలో మూడు కిలోమీటర్లకు పైగా సొరంగం ఉందని, ఆక్సిజన్ అక్కడ తక్కువగా ఉండడంతో గాలింపు చర్యలకు ఇబ్బందిగా ఉందని ఆయన చెప్పారు. గాలింపు కోసం నిపుణులు అవసరమని, గల్లంతైన ముగ్గురు వ్యక్తుల ఆచూకీని కనుగొనేందుకు త్వరలోనే జబల్‌పూర్ నుంచి సైనిక బృందం రానున్నదని, ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందితో కలసి వీరు గాలింపు చర్యలు చేపడతారని ఆయన తెలిపారు.

Rewards for three rescued passengers in Sidhi bus accident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News