Monday, April 29, 2024

‘ఓ చేతిలో రైఫిల్, మరో చేతిలో పాలు’ (వీడియో)

- Advertisement -
- Advertisement -
Rifle in one hand and milk in another
కానిస్టేబుల్ సాహసంపై  స్పందించిన రైల్వేమంత్రి

న్యూఢిల్లీ : భోపాల్ రైల్వే స్టేషన్‌లో ఓ చిన్నారి కోసం పాల ప్యాకెట్ అందించే క్రమంలో రైల్వే కానిస్టేబుల్ చేసిన సాహసాన్ని ఆ శాఖ మంత్రి పీయూష్‌గోయల్ కొనియాడారు. ‘ఓ చేతిలో రైఫిల్, మరో చేతిలో పాలు, భారత రైల్వేల వెం ట ఉసేన్ బోల్ట్’ అంటూ గోయల్ ట్వీట్ చేశారు. భారత రైల్వేశాఖకు ఇందర్‌యాదవ్ చేసిన సాహసం నిదర్శనమంటూ పరుగు పందెంలో రికార్డు సృష్టించిన జమైకా పరుగు యోధుడు ఉసైన్‌బోల్ట్‌ను గోయల్ గుర్తు చేశారు.

ఇందర్‌యాదవ్‌కు గోయల్ నగదు బహుమతి కూడా ప్రకటించారు. శ్రామిక్ రైలులో వెళ్తున్న షఫియా హష్మీ అనే మహిళ భోపాల్ స్టేషన్‌లో రైలు ఆగినపుడు తన కూతురి కోసం పాల ప్యాకెట్ తెచ్చి పెట్టాల్సిందిగా అక్కడ డ్యూటీ నిర్వహిస్తున్న యాదవ్‌ను అభ్యర్థించారు. యాదవ్ పాల ప్యాకెట్ తీసుకొచ్చే సమయానికి రైలు స్పీడందుకోవడంతో అతడు అంతే వేగంతో పరుగెత్తి ఎట్టకేలకు పాల ప్యాకెట్ అందించ గలిగారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గోయల్ స్పందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News